మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిర‌స్క‌ర‌ణ

కావాల‌ని కుట్ర‌కు తెర లేపారంటూ ఏఐసీసీ ఫైర్

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ఏఐసీసీ అధిష్టానం నిర్ణ‌యించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు పార్టీకి అందించిన సేవ‌ల‌కు గాను మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ ను కాద‌ని పార్టీ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు ఛాన్స్ ఇచ్చింది రాజ్య‌స‌భ కోసం ఎంపీగా. త‌ను రాహుల్ గాంధీ న‌మ్మ‌క‌మైన టీంలో స‌భ్యురాలిగా ఉన్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పార్టీ ప‌రంగా ప్రక్షాళ‌న ప్రారంభించింది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లు చేశారు మీనాక్షి న‌ట‌రాజ‌న్ అట్ట‌హాసంగా.

అయితే త‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఎన్నిక‌ల క‌మిష‌న్. రిట‌ర్నింగ్ అధికారి త‌న నామినేష‌న్ చెల్ల‌దంటూ తిర‌స్క‌రించారు. దీంతో అవాక్క‌య్యారు మీనాక్షి నట‌రాజ‌న్ తో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు. కాగా ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో తెలంగాణకు సంబంధించిన ఒక అంశాన్ని వెల్లడించ లేదంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. దీనిపై రిట‌ర్నింగ్ అధికారి ఇది వాస్త‌వ‌మేనంటూ అంగీక‌రించారు. త‌న నామినేష‌న్ తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ, అధికారికంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, కేవలం నోటీసు మాత్రమే జారీ చేశారని, అందువల్ల వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని వాదించింది

రాజ్యసభ ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతుందనే భయాల నేపథ్యంలో కాంగ్రెస్ తన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలను కర్ణాటకలోని ఒక రిసార్ట్‌కు తరలించిన తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your Email Id will not be published!