న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన ప్రకటన చేసింది. సోమవారం ఈ మేరకు పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది పహల్గామమ్ ఉగ్రదాడి . ఈ కేసులో ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రమేయం ఉందంటూ పేర్కొంది. ఇదే కేసులో హఫీజ్ సయీద్ ను కూడా చేర్చింది. ఈ విషయాన్ని వెల్లడించింది ఎన్ఐఏ.
పాకిస్థాన్ మద్దతుతో జరిగిన కుట్రను అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది దర్యాప్తు సంస్థ. దీంతో ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన జమాత్-ఉద్-దవా . అధినేత మరియు లష్కర్-ఎ-తైబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.
25 మంది పర్యాటకులు , ఒక స్థానిక గుర్రపు కాపరితో సహా మొత్తం 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ దాడి వెనుక సయీద్ ప్రధాన కుట్రదారుగా ఉన్నారని ఛార్జ్‌షీట్ ఆరోపిస్తోంది . ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడులలో ఇది ఒకటి. దర్యాప్తు సంస్థ ప్రకారం సయీద్‌పై వ్యక్తిగతంగానూ, అలాగే నిషేధిత సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అధినేతగానూ అభియోగాలు మోపబడ్డాయి. టీఆర్ఎఫ్ సంస్థ జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద ఘటనలతో సంబంధం కలిగి ఉంది. భారతదేశంపై యుద్ధం చేసే లక్ష్యంతో సరిహద్దు దాటి కుట్ర పన్నారని, ఆయా నెట్‌వర్క్‌ల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను నడిపించారని ఏజెన్సీ ఆయనపై ఆరోపణలు చేసింది. సయీద్ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కర్-ఎ-తైబా వ్యవస్థాపకుడు .ఈ సంస్థను ఐక్యరాజ్యసమితి , అనేక దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.
