జీ5 నుండి దిల్జిత్ దోసాంజ్ మూవీ స‌ట్లూజ్ తొల‌గింపు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మీడియా, మూవీ సంస్థ

ముంబై : ప్ర‌ముఖ పంజాబ్ గాయ‌కుడు, న‌టుడు దిల్జిత్ దోసాంజ్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌ను ముఖ్య పాత్ర పోషించిన చిత్రం స‌ట్లూజ్ ను త‌మ సంస్థ నుండి తొల‌గిస్తున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది జీ మీడియా సంస్థ‌. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండ‌గా మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా (1995లో అదృశ్యమయ్యారు) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి హనీ త్రెహాన్ దర్శకత్వం వహించారు. ఆర్ఎస్వీపీ, మాక్ గుఫిమ్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా స‌ట్లుజ్ ను నిర్మించాయి. ఇందులో అర్జున్ రాంపాల్, కన్వల్‌జిత్ సింగ్, సువిందర్ విక్కీ , గీతిక విద్యా ఓహ్లాన్ కూడా నటించారు.

జీ5 ఒక అధికారిక ప్రకటనలో ఈ చిత్రానికి లభించిన స్పందనను అభినందిస్తూ, వీక్షకుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.విడుదలైనప్పటి నుండి ‘సట్లూజ్’కు లభించిన స్పందన నిజంగా అద్భుతం. ఈ చిత్రాన్ని చూసి, ఆదరించిన ప్రతి వీక్షకుడికి మేము ఎంతో కృతజ్ఞులం. మీ ప్రేమ , మద్దతు మాకు, అలాగే ఈ కథను తెరకెక్కించిన వారికి ఎంతో విలువైనవి అని ఆ ప్లాట్‌ఫారమ్ పేర్కొంది. మేము ‘సట్లూజ్స‌కు ,దాని వెనుక ఉన్న సృజనాత్మక దృక్పథానికి గట్టిగా కట్టుబడి ఉన్నాము. శక్తివంతమైన కథనానికి స్ఫూర్తినిచ్చే, చిరకాలం నిలిచి పోయే , శాశ్వత ప్రభావాన్ని చూపే సామర్థ్యం ఉందని మేము నమ్ముతున్నాము. ప్రామాణికమైన మరియు అర్థవంతమైన కథనాలను ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నామ‌ని తెలిపింది.

కాగా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ‘సట్లూజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని మా ప్రేక్షకులకు తిరిగి అందించడానికి తగిన ప్రక్రియ ద్వారా అన్ని మార్గాలను అన్వేషించడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your Email Id will not be published!