అమరావతిలో శాంసంగ్ ఆర్ అండ్ డీ సెంట‌ర్

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జో యున్ తో లకేష్

సియోల్ (సౌత్ కొరియా) : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఎఫైర్స్) యంగ్ జో యున్ గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని 10 GW డేటా-సెంటర్ పైప్‌లైన్‌ను కేంద్రంగా చేసుకుని, డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్‌తో కూడిన పూర్తి AI-కంప్యూట్ స్టాక్ కోసం భారత్ లో ఆంధ్రప్రదేశ్‌ను శాంసంగ్ కేంద్రంగా మార్చాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతోపాటు ఏపీలో AI-సర్వర్ తయారీని లోకలైజ్ చేయడానికి ముందుకు రావాల‌ని కోరారు. ఏపీలో ఒక డిస్‌ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాల‌ని సూచించారు లోకేష్.

విశాఖపట్నంలోని ఐఎస్ఎం ఓసాట్ క్లస్టర్‌ను కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ కోసం ఒక OSAT సదుపాయాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను అన్వేషించండి. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్, డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని సూచించారు మంత్రి. అమరావతి రాజధాని నగరం లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో శాంసంగ్ భాగస్వామి కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ 133-క్యూబిట్ IBM క్వాంటం సిస్టమ్ టూపై పరిశోధన చేయడానికి, శాంసంగ్ యొక్క ఆర్ అండ్ డి విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురండి. శాంసంగ్ తన బహుళ విభాగాలకు నిలయంగా ఉండేలా ఒక ప్రత్యేక ‘శాంసంగ్ సిటీ’ని ఏపీలో నిర్మించాల్సిందిగా మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.

Leave A Reply

Your Email Id will not be published!