విద్యార్థులు ‘రీల్స్’కు బదులుగా పాడ్‌కాస్ట్‌లు చూడాలి

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ న‌టుడు సూర్య

చెన్నై : త‌మిళ సినీ న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న విద్యార్థుల‌కు కీల‌క సూచ‌న‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. విద్యార్థులు త‌మ విలువైన కాలాన్ని పూర్తిగా రీల్స్ పై ఫోక‌స్ పెడుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల‌ని, వినూత్నంగా ఆలోచించాల‌ని సూచించారు న‌టుడు. ‘రీల్స్’కు బదులుగా పాడ్‌కాస్ట్‌లు చూడాలని కోరాడు. తాజాగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన శివకుమార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. విద్యార్థులకు సుదీర్ఘమైన కంటెంట్‌ను అన్వేషించాలని, వైఫల్యాన్ని మరో ప్రయత్నానికి అవకాశంగా చూడాలని పిలుపునిచ్చారు. తన తండ్రి శివకుమార్ స్థాపించిన ‘శివకుమార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ 47వ వార్షికోత్సవ వేడుకలు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు సూర్య‌. ఈ సంద‌ర్బంగా విద్యార్థులకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు బానిసలు కావ‌ద్ద‌ని కోరాడు.

విజయవంతమైన వ్యక్తుల జీవితాల గురించి తెలుసు కోవడానికి పాడ్‌కాస్ట్‌లను వినాలని కోరాడు. అలాగే వైఫల్యాన్ని విజయం సాధించేందుకు లభించిన మరో అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. ‘కరుప్పు’ వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకు పోతున్న సూర్య‌ ప్రస్తుతం విద్యార్థులకు జీవిత పాఠాలను నేర్పించే కొత్త బాధ్యతను చేపట్టారు. కేవలం చిన్న చిన్న వీడియోలను (రీల్స్) చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా, పాడ్‌కాస్ట్‌లు వినడం , ఆన్‌లైన్‌లో లోతైన పరిశోధన చేయడం ద్వారా విషయాలను బాగా అర్థం చేసుకోవాలని విద్యార్థులకు కీల‌క సూచ‌న‌లు చేశారు. మీరు కేవలం రీల్స్ చూస్తూ ఉంటే, అది ఒక కథను చూడటం మాత్రమే అవుతుంది. దాని నుండి మీరు కొత్తగా ఏమీ నేర్చుకోలేక పోవచ్చు అని ఆయన పేర్కొన్నారు సూర్య‌. విద్యార్థులు సుదీర్ఘమైన పాడ్‌కాస్ట్‌లను చూసి, విజయం సాధించిన వ్యక్తుల నిజ జీవిత ప్రయాణాల నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆయన ప్రోత్సహించారు.

Leave A Reply

Your Email Id will not be published!