Venkaiah Naidu : మేరునగధీరుడు వెంకయ్య నాయుడు
విలువలు కలిగిన రాజకీయ నేత
Venkaiah Naidu : ఈ ఏడాది ఆగస్టు నెలకు ప్రత్యేకత ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది ప్రభుత్వం.
తెలుగు వారైన ఇద్దరు ఉన్నత పదవులలో కొలువు తీరిన వారు పదవీ విరమణ చేయనున్నారు. ఒకరు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
నూతలపాటి వెంకట రమణ అయితే మరొకరు విలక్షణమైన రాజకీయ నాయకుడిగా పేరొందిన ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.
భారతీయ జనతా పార్టీలో ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. బహు భాషా కోవిదుడిగా, ఏ అంశాన్నైనా అనర్ఘలంగా మాట్లాడే వక్తగా పేరొందారు.ఒక రకంగా
చెప్పాలంటే కాషాయంలో ఆయన ఓ సంచలనం. మాటల్ని పొదుపుగా అంతకంటే బాణాల కంటే పదునుగా మాట్లాడటం వెంకయ్య నాయుడికే చెల్లింది.
ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు ప్రధాన మంత్రి మోదీ. నేటి యువత ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఈ సమయంలో తెలుగు వారందరికీ గర్వ కారణంగా నిలిచిన వెంకయ్య నాయుడి(Venkaiah Naidu) గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎమ్మెల్యేగా, మంత్రిగా, బీజేపీ చీఫ్ గా, ఉప రాష్ట్రపతిగా ఇలా ఎన్నో పదవులు నిర్వహించారు. ప్రత్యర్థుల్ని తన వాగ్ధాటితో, అపరిమితమైన ప్రతిభతో ముప్పు తిప్పలు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఆయన నాయకుడే కాదు స్వతహాగా రచయిత కూడా. వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) చేసిన ప్రసంగాలు చాలా మటుకు ఎందరికో పాఠాలుగా ఉపయోగపడ్డాయి.
రెఫరెన్స్ గా కూడా ఉన్నాయంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వెంకయ్య నాయుడు 13వ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆ పదవికి వన్నెతెచ్చారు.
ఆయన ఎక్కడికి వెళ్లినా మాతృ భాషలో మాట్లాడాలని కోరుతారు. అన్య భాషలను ప్రేమించమంటారు. ఎక్కడికి వెళ్లినా తెలుగుదనం ఉట్టి పడేలా నడుచు కోవడం ఇష్టం కూడా.
ఆయన వయస్సు 74 ఏళ్లు. 1948 జూన్ 23న నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టారు. లా చదివారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం, రైతు కుటుంబాల కోసం కృషి చేశాడు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులను ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లాడు. 2002 నుంచి 2004 దాకా బీజేపీకి చీఫ్ గా ఉన్నారు.
తన ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఆయనకు నేర్చుకోవడం, చదవడం,రాయడం..ప్రసంగించడం అంటే ఇష్టం. 1978లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1983లో అదే స్థానం నుంచి గెలుపొందారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. 1993లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1998లో రాజ్యసభకు
ఎన్నికయ్యారు.
2000లో వాజ్ పేయ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మరాఠా ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేశారు.
విలువలకు కట్టుబడిన రాజకీయ నాయకుడిగా పేరొందారు వెంకయ్య నాయుడు. నేటి రాజకీయ గందరగోళ పరిస్థితుల్లో తనను తాను
స్పూర్తి దాయకంగా ఉండేలా మల్చుకున్నారు.
ఏది ఏమైనా వెంకయ్య నాయుడు పది కాలాల పాటు ఇలాగే ఉండాలని కోరుకుందాం.
Also Read : తమిళనాడు గవర్నర్ తో తలైవా భేటీ