Saba Karim : కెప్టెన్సీ మార్పుపై స‌బా క‌రీం ఫైర్

ధావ‌న్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ కు చాన్స్

Saba Karim : భార‌త క్రికెట్ మాజీ సెల‌క్ట‌ర్ స‌బా క‌రీం సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల‌, సెలక్ట‌ర్ల నిర్ణ‌యాల‌పై భ‌గ్గుమ‌న్నాడు.

జింబాబ్వేలో ప‌ర్య‌టించే వ‌న్డే సీరీస్ కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే కెప్టెన్ గా వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ను డిక్లేర్ చేసింది బీసీసీఐ.

కానీ ఉన్న‌ట్టుండి గాయం కార‌ణంగా ఆడ‌లేక పోయిన కేఎల్ రాహుల్ తిరిగి జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో శిఖ‌ర్ ధావ‌న్ ను త‌ప్పించింది. అత‌డి స్థానంలో కేఎల్ఆర్ కు ఇచ్చింది.

ఆపై డిప్యూటీ కెప్టెన్ గా డిమోష‌న్ ఇచ్చింది. దీనిపై నిప్పులు చెరిగాడు స‌బా క‌రీం(Saba Karim). అస‌లు బీసీసీఐలో ఏం జ‌రుగుతుందో అర్థం కావ‌డం లేద‌న్నాడు.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏ దేశ క్రికెట్ బోర్డు ఇలాంటి చెత్త నిర్ణ‌యాలు తీసుకోవడం లేద‌ని మండిప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మందిని కెప్టెన్లుగా మార్చారంటూ గుర్తు చేశాడు.

దీని వ‌ల్ల ఆడే ఆట‌గాళ్ల‌లో మాన‌సిక స్థైర్యం త‌గ్గుతుంద‌ని వాపోయాడు. నాయ‌క‌త్వ ప‌రంగా చూస్తే కేఎల్ రాహుల్ కంటే శిఖ‌ర్ ధావ‌న్ ట్రాక్ రికార్డ్ బాగుందుని గుర్తు చేశాడు స‌బా క‌రీం.

వ‌న్డే సీరీస్ కు ఎంపిక చేసి ఆ త‌ర్వాత ఇలాంటి చెత్త నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారంటూ నేరుగా బీసీసీఐ సెలక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ‌ను. రాహుల్ ను త‌క్కువ చేయ‌డం కాద‌ని పేర్కొన్నారు.

విండీస్ టూర్ లో అద్భుతంగా కెప్టెన్సీ నిర్వ‌హించాడ‌ని ధావ‌న్ కు కితాబు ఇచ్చాడు స‌బా క‌రీం. ప్ర‌స్తుతం స‌బా క‌రీం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : స‌రిహ‌ద్దు వివాదం సంబంధాల‌పై ప్ర‌భావం

Leave A Reply

Your Email Id will not be published!