Kulgam Grenade Attack : కుల్గామ్ లో గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి
జమ్మూ కాశ్మీర్ లో అప్రమత్తమైన ఆర్మీ
Kulgam Grenade Attack : ఓ వైపు దేశంలో 75 ఏళ్ల వజ్రోత్సవాలు కొనసాగుతున్నాయి. పంధ్రాగస్టు కంటే ముందు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశమంతా అలర్ట్ గా ఉండాలని, ఉగ్రవాదులు దాడులకు దిగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.
ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడడంతో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ ఘటన అనంతరం బీహార్ కు చెందిన వలస కూలీని పొట్టన పెట్టుకున్నారు. మరో కూలీకి గాయాలయ్యాయి.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు గ్రెనేడ్ తో దాడికి (Kulgam Grenade Attack) పాల్పడ్డారు. ఈ అనుకోని ఆకస్మిక దాడిలో పోలీసు మృతి చెందాడు. చికిత్స నిమిత్తం అనంతనాగ్ లోని జీఎంసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కుల్గామ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడిని తాహిర్ ఖాన్ గా గుర్తించారు. ఈ సందర్భంగా ఖైమోహ్ కుల్గామ్ లో గ్రెనేడ్ దాడి ఘటన చోటు చేసుకుంది.
ఈ ఉగ్ర ఘటనలో పూంచ్ కు చెందిన తాహిర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. అప్పటికే మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొన్నారు. శ్రీనగర్ లోని ఈద్గాలోని అలీ జాన్ రోడ్ లో భద్రతా బలగాలపై తీవ్రవాదులు ఒక గ్రెనేడ్ విసిరారు.
ఉగ్రవాదుల దాడులు ముమ్మరం చేయడంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భత్రను కట్టుదిట్టం చేశారు. సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు.
Also Read : సమీర్ వాంఖడే కులంపై క్లీన్ చిట్