PM Shehbaz Sharif : సంక్షోభం అంచున పాకిస్తాన్ – ప్ర‌ధాని

ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం

PM Shehbaz Sharif : పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంద‌ని దీనిని కాపాడు కోవాలంటే తీవ్రంగా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు దేశ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌(PM Shehbaz Sharif).

ఇలాగే ఉంటే ఇక అభివృద్ధి చెంద‌డం అటుంచితే ప‌త‌నానికి దారి తీయ‌డం ఖాయ‌మ‌న్నారు. గ‌తంలో ఏలిన పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం 48 మిలియ‌న్ డాల‌ర్ల లోటును మిగిల్చిందంటూ ఆరోపించారు.

పెట్రోలియం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో దీర్ఘ‌కాలిక ఇంధ‌న ఒప్పందాల‌ను కుద‌ర్చు కోవ‌డంలో పూర్తిగా విఫ‌లైమంద‌ని మండిప‌డ్డారు ప్ర‌ధాన మంత్రి. ఆర్థిక సంక్షోభానికి గ‌త ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఆర్థికంగా పురోగ‌మిస్తేనే ఏమైనా ఆశ‌లు ఉంటాయ‌న్నారు. 75వ స్వాతంత్ర దినోత్స‌వాన్ని పురస్క‌రించుకుని దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌సంగించారు.

ఆయ‌న రేడియో, టెలివిజ‌న‌లో మాట్లాడారు. పాకిస్తాన్ కొన‌సాగుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డాల‌ని పిలుపునిచ్చారు.

గ‌తంలో ఇమ్రాన్ ఖాన్ కొలువు తీరిన స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా తాను అప్ప‌టి ప్ర‌భుత్వానికి ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా మంద‌గ‌మ‌నంలో ఉందో తెలియ చేశాన‌ని చెప్పారు.

ఇవాళ ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరాక మ‌రోసారి పున‌రావృతం చేస్తున్నాను. ఆర్థిక పురోగ‌తి లేకుండా దేశం ఎన్న‌డూ అభివృద్ధి సాధించ‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు షెహ‌బాజ్ ష‌రీఫ్‌.

పాకిస్తాన్ ఉద్య‌మ నాయ‌కుల‌కు నివాళులు అర్పించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా నివసిస్తున్న మిలియ‌న్ల మంది పాకిస్తానీల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ పీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : కుల్గామ్ లో గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!