Dinesh Paruchuri : దినేష్ రాకతో అక్రమార్కుల్లో గుబులు
రీజినల్ డైరెక్టర్ గా నియాకం
Dinesh Paruchuri : గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఎవరినైనా నియమిస్తే అంతగా పట్టించుకునే వారు కాదు. కానీ తెలంగాణలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి.
ఈ తరుణంలో కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో ఉన్న గులాబీ దళం మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలు పదే పదే టీఆర్ఎస్ ను, సీఎం కేసీఆర్ ను , ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ అంటూ ప్రకటిస్తున్నారే తప్పా చేతల్లో చూపడం లేదు. ఇదే క్రమంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చుక్కలు చూపించింది.
కానీ ఆరోజు నుంచి నేటి దాకా ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ఇక సీఎం కు సపోర్ట్ గా ఉంటూ వచ్చిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎవరనే దానిపై ఆదాయ పన్ను, ఈడీ, ఏసీబీ కన్నేసినట్లు సమాచారం.
అందులో భాగంగానే కీలకమైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రీజినల్ డైరెక్టర్ పదవిలో ముఖ్యమైన ఆఫీసర్ ను తీసుకు వచ్చింది. ఇక్కడున్న అధికారిని తప్పించింది. ఐఆర్ఎస్ దినేష్ పరుచూరికి (Dinesh Paruchuri) పదవీ బాధ్యతలు అప్పగించింది.
ఆయనను అదనపు డైరెక్టర్ గా నియమించింది. ముంబై జోన్ లో పని చేసతున్న యోగేష్ శర్మను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసింది. ఇక్కడున్న జాయింట్ డైరెక్టర్ ను ముంబైకి ట్రాన్స్ ఫర్ చేశారు.
ఇక దినేష్ పరుచూరి రెండు తెలుగు రాష్ట్రాలను కవర్ చేస్తారు. ఇక దినేష్ పరుచూరికి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన ఎవరికీ లొంగరన్న పేరుంది. పలు స్కాంలను వెలుగులోకి తీసుకు వచ్చిన చరిత్ర ఆయన స్వంతం.
Also Read : ఆమె లేకుండా నేనుండ లేను