TS Jobs : ఆర్థిక శాఖ ఓకే మ‌రి భ‌ర్తీ మాటేంటి

గురుకులాల‌లో కూడా ఎన్నిక‌ల మాటేనా

TS Jobs : అదిగో పోస్టులు. ఇదిగో జాబ్స్ అంటూ ఊద‌ర‌గొడుతూ వ‌స్తున్న స‌ర్కార్ . ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్ట్ కూడా భ‌ర్తీకి నోచుకోలేదు. సీఎం అసెంబ్లీలో ప్ర‌క‌టించిన నాటి నుంచి నేటి దాకా.

మునుగోడు ఉప ఎన్నిక రెడీగా ఉంది. ఆ త‌ర్వాత ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు గ‌నుక వెళితే ఇక జాబ్స్(TS Jobs) మాట నీటి మూట‌లేన‌ని నిరుద్యోగులు వాపోతున్నారు.

ఆర్థిక శాఖ క్లియ‌రెన్స్ ఇచ్చినా ఈరోజు వ‌ర‌కు నోటిఫికేష‌న్లు కొన్నింటికే ఇచ్చారు. కానీ అవి ఎప్పుడు భ‌ర్తీ అవుతాయో తెలియ‌ని స్థితి నెల‌కొంది. ఇటీవ‌ల ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో కొలువు తీరింది.

ఆ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని ఒకే ఒక్క సంత‌కంతో సీఎం భ‌గ‌వంత్ మాన్ ప‌ర్మినెంట్ ఉద్యోగ నియామ‌కాల ప‌త్రాలు అంద‌జేశారు.

అదీ చిత్త‌శుద్ది అంటే. కోర్టులు, కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే భ‌ర్తీ చేసింది త‌క్కువ‌. ప్ర‌క‌ట‌న‌లు, మాట‌లు మాత్రం ఎక్కువ‌. తాజాగా మ‌రో నోటిఫేష‌న్లు అంటూ ఊరిస్తూ వ‌స్తున్నారు.

9,096 గురుకులాల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టి దాకా నోటిఫికేష‌న్లు లేవు. యూనివ‌ర్శిటీల‌లో చాలా ఖాళీలు ఉన్నాయి.

వాట‌న్నింటినీ ఒకే గొడుగు కింద‌కు తీసుకు వ‌చ్చి నియమిస్తామంటూ ఓ క‌మ‌టీ ఏర్పాటు చేశారు. దానికి దిక్కు లేదు. తాజాగా గురుకుల విద్యా సంస్థ‌ల నియామ‌కాల బోర్డు కు అప్ప‌గించింది.

ఎక్కువ ఖాళీలు జ్యోతిబా పూలే సొసైటీల‌లో ఉండ‌డం విశేషం. టెట్ ఫ‌లితాలు వ‌చ్చాయి. గిరిజ‌న గురుకులాల్లో 1,514 జాబ్స్ , మైనార్టీ గురుకులాల్లో 1,445 ఖాళీలు ఉన్నాయి.

Also Read : వికారాబాద్ క‌లెక్ట‌రేట్ ను ప్రారంభిచిన కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!