Bilkis Bano Comment : భ‌ర‌త మాతా మ‌న్నించ‌వ‌మ్మా

దోషుల‌కు విడుద‌ల ఎందుకు

Bilkis Bano Comment : దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో ఉత్స‌వాలు చేసుకుంటున్నాం. నారీ శ‌క్తి గొప్ప‌ద‌ని , మహిళ‌ల‌ను గౌర‌వించాలంటూ పిలుపునిచ్చారు ప్ర‌ధాని ఎర్ర‌కోట సాక్షిగా.

కానీ ఇదే స‌మ‌యంలో ఈ దేశాన్ని భ‌యాందోళ‌న‌కు గురి చేసిన సంచ‌ల‌నం క‌లిగించిన గుజ‌రాత్ లోని బిల్కిస్ బానో(Bilkis Bano) సామూహిక అత్యాచారం, కుటుంబంలోని స‌భ్యుల హ‌త్య‌కు పాల్ప‌డిన దోసుల‌ను విడుద‌ల చేయ‌డం.

ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేదు. 2002 గుజ‌రాత్ అల్ల‌ర నుండి బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న 11 మంది

దోషులు గోద్రా స‌బ్ జైలు నుండి విముక్తి చెందారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్యానెల్ శిక్ష‌ను త‌గ్గించేందుకు ఆమోదించింది. రేప్ కు పాల్ప‌డిన వారి వ‌య‌స్సు, నేరం స్వ‌భావం, జైలులో ప్ర‌వ‌ర్త‌న , త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల విడుద‌ల చేయాల్సి వ‌చ్చిందంటూ స‌ర్కార్ తెలిపింది.

అంటే నేరం చేసేందుకు, రేప్ కు పాల్ప‌డేందుకు వ‌య‌స్సుతో ప‌నేంటి. ఇది మాత్రం త‌ట్ట‌లేదు బీజేపీ ప్ర‌భుత్వానికి. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ దోషులు స్వీట్లు కూడా పంచుకున్నారు.

ఇక కేసు విష‌యానికి వ‌స్తే మార్చి 3, 2002న దాహోద్ జిల్లా లోని లిమ్ ఖేడా తాలూకాలో బిల్కిస్ బానో పై (Bilkis Bano) సామూహిక రేప్ కు పాల్ప‌డ్డారు. ఆమె 3 ఏళ్ల పసిపాప‌తో పాటు 14 మందిని హ‌త్య చేశారు.

అత్యాచారానికి గురైన స‌మ‌యంలో బిల్కిస్ బానో ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తిగా ఉన్నారు. కానీ ఈ కామాంధుల కామం చ‌ల్లార‌లేదు. ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో గుజ‌రాత్ కు సీఎంగా ప్ర‌స్తుతం ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోదీ(PM Modi) ఉన్నారు.

త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గురించి బిల్కిస్ బానో జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించింది. సుప్రీంకోర్టు సీబీఐ ద‌ర్యాప్త‌న‌కు ఆదేశించింది.

2004 ఆగ‌స్టులో నిందితులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యం గురించి బాధితురాలు ఆరోపించడంతో విచార‌ణ‌ను గుజ‌రాత్ నుండి మ‌రాఠాకు బ‌దిలీ చేసింది స‌ర్వోన్న‌త న్యాయ స్థానం.

జ‌న‌వ‌రి 21, 2008న సీబీఐ ప్ర‌త్యేక కోర్టు న్యాయ‌మూర్తి యు . డి. సాల్వి 13 మంది నిందితుల‌ను దోషులుగా నిర్ధారించారు. 11 మందికి జీవిత ఖైదు విధించారు.

మే 2017లో బాంబే హైకోర్టు ఈ శిక్ష‌ను కూడా స‌మ‌ర్థించింది. 2019లో సుప్రీంకోర్టు బిల్కిస్ బానోకు రూ. 50 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది

రంజ‌న్ గొగోయ్ , దీప‌క్ గుప్తా, సంజీవ్ ఖ‌న్నాతో కూడిన ధ‌ర్మాసనం.

ఇక విడుద‌లైన వారిలో జ‌స్వంత్ నాయ్ , గోవింద్ నాయ్, శైలేష్ భ‌ట్ , రాధే శం షా, బిపిన్ చంద్ర జోషి, కేస‌ర్ భాయ్ వోహానియా, ప్ర‌దీప్ మోర్దియా,

బ‌కాభాయ్ వోహానియా , రాజు భాయ్ సోనీ , మితేష్ భ‌ట్ , ర‌మేష్ చందానా ఉన్నారు.

విచిత్రం ఏమిటంటే ఇంత‌కంటే త‌క్కువ నేరం చేసిన ఎంతో మంది నేర‌స్తులు జైళ్ల‌ల్లో ఉన్నారు. కానీ వీరిని విడుద‌ల చేయ‌డం వెనుక ఎవ‌రి ఉద్దేశాలు దాగి ఉన్నాయో ఆ ప్ర‌భుత్వానికి తెలియాలి .

దోషుల‌ను రిలీజ్ చేశారు స‌రే ఇప్పుడు బాధితురాలి జీవితానికి భ‌ద్ర‌త ఎవ‌రు క‌ల్పిస్తారు. ఆమెకు స‌మాజంలో ఎలాంటి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని ఆలోచించారా ఏలుతున్న వారు.

భారత మాత ఇవాళ వీళ్ల‌ను చూసి సిగ్గుతో త‌లొంచుకుంటోంది. ఇది మాత్రం వాస్త‌వం.

Also Read : రేప్ నిందితుల‌కు బీజేపీ మ‌ద్ద‌తు – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!