BS Yediyurappa Bommai : బీజేపీ వ్యూహం యెడ్డీకి సారథ్యం
పార్లమెంటరీ బోర్డులో చోటు
BS Yediyurappa Bommai : బీఎస్ యెడియూరప్ప ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి, దానిని పవర్ లోకి తీసుకు వచ్చిన ఘనత ఆయనదే.
యెడియూరప్ప బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక్కడ ఏ సర్కార్ అయినా ముందు లింగాయత్ ల ఆశీస్సులు పొందాల్సిందే.
వారే కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అన్ని పార్టీలు వారి జపమే చేస్తున్నాయి. ఇక కాషాయ పార్టీ బీజేపీలో వీరి ప్రాబల్యమే ఎక్కువ. అవినీతి, బంధు ప్రీతి కారణంగా పూర్తి కాలం సీఎంగా పని చేయలేక పోయారు యెడియూరప్ప.
ఇప్పటికీ ఆయన సీఎంగా లేక పోయినా తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారు. ఆయన తన పదవికి రాజనామా చేసి ఏడాది పూర్తయింది. అడపా దడపా వార్తల్లో నిలుస్తూ వచ్చారే తప్పా అంతగా కీలక పాత్ర పోషించడం లేదు.
ఇక యెడ్డీ స్థానంలో కొలువు తీరిన బస్వరాజ్ బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయన తండ్రి గతంలో సీఎంగా పని చేశారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం కర్నాటకలో వరుసగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో మంత్రులను కంట్రోల్ చేయలేక పోతున్నారనే అపవాదు మూట గట్టుకున్నారు.
ఇక కర్నాటకలో బీజేపీ అంటేనే మొదట గుర్తకు వచ్చేది బీఎస్ యెడియూరప్పనే(BS Yediyurappa). అంతలా ఆయన తనను తాను ప్రూవ్
చేసుకున్నారు. ఊహించని రీతిలో ఆయన లేకుండా పార్టీ మనుగడ సాధించ లేదని బీజేపీకి అర్థమై పోయింది.
అందుకే పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు యెడ్డీకి. చివరకు తన అనుచరుడికే సీఎం పదవి దక్కేలా చేసుకున్నాడు. కర్ణాటకలో ఎన్నికలు
జరిగేందుకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది.
ఈ తరుణంలో పార్టీ పవర్ లోకి రావాలంటే యెడ్డీనే ముందుంచాలని బీజేపీ భావించింది. బీజేపీ ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ పార్టీ నేతలతో కలిశారు.
ఆ వెంటనే యెడియూరప్పను కలిసి అభినందించారు.
సమావేశం ముగిసిన వెంటనే యెడియూరప్ప , బొమ్మై(Bommai) ఏపీలోని తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. తిరుపతి పర్యటనను కేవలం దర్శనం కోసమే వెళ్లామని తెలిపారు.
ఇదే సమయంలో బొమ్మైని మారుస్తారని ప్రచారం జరిగింది. కానీ అదంతా ప్రచారమేనని వాస్తవం లేదని బీజేపీ ఖండించింది.
మొత్తంగా యెడ్డీ రాకతో కాషాయం కర్ణాటకలో కళకళ లాడుతుందని నమ్ముతోంది హైకమాండ్. మరి ఈ రాజకీయ దురంధరుడు ఏం చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : సౌగతా రాయ్ ని కొట్టే రోజు వస్తుంది