Tej Pratap Yadav : మంత్రి కీల‌క మీటింగ్ లో బావ‌మ‌రిది

చిక్కుల్లో తేజ్ ప్రతాప్ యాద‌వ్

Tej Pratap Yadav :  బీహార్ లో కొత్త‌గా కొలువు తీరిన జేడీయూ, ఆర్జేడీ మ‌హా కూట‌మి స‌ర్కార్ లో కొలువు తీరిన మంత్రుల వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారుతోంది. జేడీయూ, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంయుక్తంగా 17 ఏళ్ల పాటు క‌లిసి ఉన్నాయి.

కానీ ఉన్న‌ట్టుండి సీఎం నితీశ్ కుమార్ ఆ బంధానికి చెక్ పెట్టారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో జ‌త క‌ట్టారు. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. నూత‌న ప్ర‌భుత్వ ఏర్పాటుతో పాటు 31 మందితో కేబినెట్ ను విస్త‌రించారు.

ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చి పడింది. చాలా మంది మంత్రులు త‌మ బంధువుల‌ను కూడా ఇన్ వాల్వ్ చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేలా చేస్తోంది. విచిత్రం ఏమిటంటే లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇద్ద‌రు త‌న‌యుల‌కు కీల‌క పోస్టులు ద‌క్కాయి.

తేజ‌స్వి యాద‌వ్ కు బీహార్ డిప్యూటీ సీఎం ప‌ద‌వి ల‌భిస్తే సోద‌రుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్(Tej Pratap Yadav) కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే మంత్రిగా కొలువు తీరిన తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ త‌న అధికారిక స‌మీక్షా స‌మావేశంలో త‌న బావ మ‌రిదిని ప‌క్క‌నే కూర్చో బెట్టుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

స‌మావేశం పూర్త‌య్యేంత దాకా వ‌ద్దే ఉండ‌మ‌ని కోరాడు. విచిత్రం ఏమిటంటే అధికారిక కార్య‌క్ర‌మాల్లో కేబినెట్ లో ఎక్కువ మంది మంత్రులు త‌మ బంధువుల‌ను ఉండాలంటూ కోర‌వ‌డం ఉన్న‌తాధికారుల‌కు షాక్ కు గుర‌య్యేలా చేస్తోంది.

ఎంపీ అయిన యాద‌వ్ సోద‌రి మిసా భార‌తిని పెళ్లి చేసుకున్న శైలేష్ కుమార్ అభినందించేందుకు ఆఫీసుకు వ‌చ్చారు. ఫోటోలు కూడా పంచుకున్నారు. తాజా వివాదంపై సీఎం నితీశ్ కుమార్ ఇంకా స్పందించ లేదు.

Also Read : ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడి

Leave A Reply

Your Email Id will not be published!