Asia Cup 2022 Sri Lanka : ఆసియా కప్ కు శ్రీలంక జట్టు డిక్లేర్
టీంకు కెప్టెన్ గా దాసున్ షనక
Asia Cup 2022 Sri Lanka : యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రతిష్టాత్మకమైన మెగా ఈవెంట్ ఆసియా కప్ ప్రారంభం కానుంది. 28న దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది.
ఇక కప్ రేస్ లో పాకిస్తాన్ తో పాటు ఇండియా, శ్రీలంక కూడా హాట్ ఫెవరేట్ గా ఉన్నాయి. ఈ సందర్భంగా కీలకమైన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది.
జట్టుకు సారథ్య బాధ్యతలను దాసున్ షనక కు అప్పగించింది. ఆసియా కప్ కు సంబంధించి 20 మంది ఆటగాళ్లతో జట్టును డిక్లేర్ చేసింది.
ధనుంజయ డిసిల్వా, హసరంగ, చమీరా, కరుణ రత్నే , నిస్సంక, అసలంక, చండిమల్ , బేబీ మలింగ లకు చాన్స్ దక్కింది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఆసియా కప్ నిర్వహించ లేదు.
కాగా ఆసియా కప్ ను శ్రీలంకలో(Asia Cup 2022 Sri Lanka) నిర్వహించాల్సి ఉండగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది.
ఈ మేరకు దేశ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయలేమని తెలియ చేయడంతో శ్రీలంక బోర్డు ఐసీసీకి నో చెప్పింది. దీంతో తటస్థ వేదికగా యూఏఈని ఎంపిక చేసింది.
ఆసియా కప్(Asia Cup 2022) ను ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక శ్రీలంక జట్టు పరంగా చూస్తే షనక కెప్టెన్. అసలంక వైస్ కెప్టెన్.
గుణతిలక, నిస్సంక, కుశాల్ , భానుక రాజపక్స, బండార, డిసిల్వా, హసరంగా, తీక్షణ వాడర్ సే, ద్వండర్ సే, ఫెర్నాండో, చమిక, మధుశంక, పతిరన, చందిమల్ , నువానిందు , కాసున్ రజిత ఉన్నారు.
Also Read : రెండో వన్డే లోనూ భారత్ దే హవా