TASK TSSC : టాస్క్ తో టీఎస్‌ఎస్‌సీ ఒప్పందం

ఇక 5జీలో విస్తృతంగా శిక్ష‌ణ..ఉపాధి

TASK TSSC : టెక్నాల‌జీ మారుతోంది. ప్ర‌ధానంగా టెలికాం రంగంలో కీల‌క‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌ప్పుడు 2జీ, 3జీ ఉండేది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 4జీ న‌డుస్తోంది.

కానీ దానిని త‌ల‌ద‌న్నేలా అత్యంత వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీతో ప్ర‌పంచం నివ్వెర పోయేలా భార‌త్ లో 5జీ కొలువు తీర‌నుంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌రంలోని టెలికాం మంత్రిత్వ శాఖ‌లో 5జీ స్పెక్ట్ర‌మ్ బిడ్ వేలం పాట నిర్వ‌హించింది.

భార‌త దేశ చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరుగ‌ని రీతిలో పెద్ద ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది. ఇందులో రిల‌య‌న్స్ జియో, ఎయిరె టెల్ , వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ ఆఫ్ నెట్ వ‌ర్క్ పార్టిసిపేట్ చేశాయి. జియో, ఎయిర్ టెల్ టెలికాం కంపెనీలు ఇప్ప‌టికే టెస్టింగ్ లు మొద‌లు పెట్టాయి.

దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గరాల‌లో ముంద‌గానే 5జీ సేవ‌ల‌ను విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నాయి. దీని వ‌ల్ల టెలికాం, ఐటీ, లాజిస్టిక్, త‌దిత‌ర సంస్థ‌ల‌న్నీ ఈ విస్తృత‌మైన సేవ‌ల‌తో మ‌రింత రాకెట్ కంటే వేగంగా సేవ‌లు అందిస్తాయి.

దీని వ‌ల్ల స‌మ‌యం వృధా కాదు. కొత్త‌గా ఏర్పాటు కాబోయే 5జీ సేవ‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇందులో శిక్ష‌ణ‌తో పాటు ఉపాధి అవ‌కాశాలు మరింత పెర‌గ‌నుండ‌డంతో ట్రైనింగ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

ఈ ఒక్క 5జీ వ‌ల్ల వ‌చ్చే 2025 నాటికి దేశంలో 2 కోట్ల‌కు పైగా జాబ్స్ రానున్న‌ట్లు అంచ‌నా వేశారు. ఐఓటీ, ఏఈ, ఎంఎల్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ , రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేష‌న్ వంటి వాటికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

ఇందులో భాగంగా శిక్ష‌ణ ఇచ్చేందుకు టాస్క్ తో టీఎస్ఎస్ సీ(TASK TSSC)  ఒప్పందం కుదుర్చుకుంది. ద‌శ‌ల వారీగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

Also Read : టెన్సెంట్ లో భారీగా ఉద్యోగాల‌లో కోత

Leave A Reply

Your Email Id will not be published!