Vijay Shekhar Sharma : పేటీఎం చీఫ్ గా విజయ్ శేఖర్ శర్మ
తిరిగి నియమితులైన సిఇఓ
Vijay Shekhar Sharma : భారత దేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ , క్యూఆర్ , మొబైల్ చెల్లింపుల సంస్థగా పేరొందిన పేటీఎం ఫౌండర్ కమ్ సిఇఓ విజయ్ శేఖర్ శర్మ చీఫ్ గా ఎన్నికయ్యారు.
ఆయన మరోసారి ఎన్నిక కావడం విశేషం. పేటీఎం బ్రాండ్ ను కలిగి ఉన్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్ ) ఇటీవల తన 22వ వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎం) పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా నిర్వహించింది.
ఇదిలా ఉండగా విజయ్ శేఖర్ శర్మ రెమ్యూనరేషన్ తీర్మానానికి అనుకూలంగా 94.48 శాతం ఓట్లు రావడం విస్తు పోయేలా చేసింది.
కాగా 99.67 శాతం వాటాదారులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయడంతో పేటీఎం మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా విజయ్ శేఖర్ శర్మ తిరిగి నియమితులయ్యారు.
అయితే శర్మను మరో ఐదేళ్ల పాటు ఎండీగా తిరిగి నియమించాలని కంపెనీ షేర్ హోల్లర్లు 99.67 శాతం మెజారిటీతో ఓటు వేశారు.
అతని పునర్నియామకానికి అనుకూలంగా దాదాపు 100 శాతం ఓట్లు రావడం కంపెనీ నాయకత్వంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
కంపెనీ వృద్ది , లాభదాయకత లక్ష్యంపై వారు నమ్మకంగా ఉన్నారని చూపిస్తుందని పేటీఎం(Paytm) తన ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు మే 2022లో ఓసీఎల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు విజయ్ శేఖర్ శర్మను(Vijay Shekhar Sharma) మేనేజింగ్ డైరెక్టర్ గా తిరిగి నియమించడాన్ని ఆమోదించారు.
మరో వైపు కంపెనీ లోని ఇతర ఉద్యోగులందరికీ వర్తించే పాలసీ ప్రాక్టీస్ లాగా కాకుండా అతని వేతనం ఎటువంటి వార్షిక ఇంక్రిమెంట్ లేకుండా తదుపరి మూడేళ్లకు నిర్ణయించ బడుతుంది.
Also Read : సమయాన్నిపెట్టుబడి పెట్టండి – మహీంద్రా