Ravi Shastri : కోహ్లీ ఫామ్ లోకి వ‌స్తే ఆప‌డం క‌ష్టం

మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి కామెంట్స్

Ravi Shastri : యూఏఈలో ఆగ‌స్టు 27 నుంచి మెగా టోర్నీ ఆసియా క‌ప్ ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు మంగ‌ళ‌వారం ఆడేందుకు చేరుకుంది. దాయాదులైన భార‌త్ , పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన పోరు ఆగ‌స్టు 28న జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టికే యావ‌త్ ప్ర‌పంచం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. ఇప్ప‌టికే మ్యాచ్ కు సంబంధించి టికెట్లు కూడా అమ్ముడు పోయాయి.

భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ కార‌ణాల రీత్యా ఇరు జ‌ట్లు గ‌త కొంత కాలం నుంచీ క్రికెట్ మ్యాచ్ ల‌కు దూరంగా ఉన్నాయి.

కేవ‌లం త‌ట‌స్థ వేదిక‌ల మీదే త‌ల‌ప‌డుతున్నాయి ఇరు జ‌ట్లు. గ‌త ఏడాది 2021లో యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్(Asia Cup 2022) లో ఊహించ‌ని రీతిలో పాకిస్తాన్ భార‌త్ కు షాక్ ఇచ్చింది.

ఏకంగా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించి విస్తు పోయేలా చేసింది. ఈ త‌రుణంలో ఆసియా క‌ప్ లో ఇరు జ‌ట్లు మూడుసార్లు త‌ల‌ప‌డ‌తాయి.

ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై అభిమానుల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ప్ర‌స్తుతం స్టార్ బ్యాట‌ర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli)మీదే అంద‌రి క‌ళ్లు ఉన్నాయి.

గ‌త కొంత కాలం నుంచీ ప‌రుగుల లేమితో తంటాలు ప‌డుతున్నాడు. ఈసారి జ‌ట్టుకు ఎంపిక కావ‌డం పై అనుమానాలు త‌లెత్తాయి. కానీ జ‌ట్టుకి ఎంపిక‌య్యాడు.

స‌త్తా చాటేందుకు ప్రాక్టీస్ లో నిమ‌గ్నం అయ్యాడు. భార‌త జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ కోహ్లీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఒక్క 50 ప‌రుగులు గ‌నుక చేసిన‌ట్ల‌యితే కోహ్లీని ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నాడు ర‌విశాస్త్రి(Ravi Shastri).

Also Read : హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కు క‌రోనా – బీసీసీఐ

Leave A Reply

Your Email Id will not be published!