Anil Kumble : పంజాబ్ కింగ్స్ కోచ్ కుంబ్లేపై వేటు
వచ్చే సీజన్ కు ఒప్పందం కటీఫ్
Anil Kumble : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఆశించిన ఫలితాలు కనబర్చక పోవడంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జట్టు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ ఉన్నట్టా లేనట్టా అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో ఊహించని రీతిలో అంతా ఆనుకున్నట్టుగానే మేనేజ్ మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి గత కొంత కాలంగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కు (Anil Kumble) షాక్ ఇచ్చింది.
అతడిని కోచ్ పదవి నుంచి తీసి వేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ లో అనిల్ కుంబ్లేను కోచ్ గా కొనసాగించడం లేదంటూ అధికారికంగా ప్రకటించింది.
ఇది ఒక రకంగా షాక్ కు గురి చేసే వార్త ఇది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ యజమానులైన ప్రముఖ నటి ప్రతి జింటా, నెస్ వాడియా కలిసి చర్చలు జరిపారు.
ఇందులో భాగంగా అనిల్ కుంబ్లే వల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం కలగడం లేదని భావించారు. ఈ మేరకు ఒప్పందాన్ని కొనసాగించడం లేదంటూ స్పష్టం చేశారు.
త్వరలోనే కుంబ్లే స్థానంలో మరో కొత్త కోచ్ ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా అనిల్ కుంబ్లే 2020లో హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమ్ పర్ ఫార్మెన్స్ పూర్తిగా నిరాశ పరిచింది.
వరుసగా రెండేళ్ల పాటు పంజాబ్ కింగ్స్ జాబితా పట్టికలో ఐదో ప్లేస్ లో నిలిచింది. ఇప్పటికీ ఐదుగురు కోచ్ లుగా పని చేసినా పంజాబ్ రాత మారలేదు.
Also Read : సూర్యా భాయ్ మోస్ట్ డేంజరస్ క్రికెటర్