Ghulam Nabi Azad : కాంగ్రెస్ నిర్వాకం బీజేపీకి బ‌లం

గులాం న‌బీ ఆజాద్ షాకింగ్ కామెంట్స్

Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కురువృద్దుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం న‌బీ ఆజాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న త‌న సుదీర్ఘ రాజీనామా లేఖ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

అయితే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఘాటుగా బ‌దులు ఇచ్చింది. ఆయ‌న బీజేపీకి ల‌బ్ది చేకూర్చేందుకే ఇలా చేశారంటూ ఆరోపించింది. పార్టీ క‌ష్ట స‌మ‌యంలో ఇలా వ‌దిలి వేసి ఎలా వెళ‌తారంటూ ప్ర‌శ్నించింది.

అయితే ఆజాద్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా రాహుల్ గాంధీ ఎప్పుడైతే పార్టీని కైవ‌సం చేసుకున్నారో ఆనాటి నుంచి నేటి దాకా పార్టీ కోలుకోలేని ప‌రిస్థితికి చేరుకుంద‌న్నారు.

అంతే కాదు ఆయ‌న వ‌ల్ల‌నే ఇవాళ సీనియ‌ర్లు బ‌య‌ట‌కు వెళ్లి పోయారంటూ మండిప‌డ్డారు. మ‌రో వైపు పార్టీ బ‌లంగా లేక పోవ‌డం కార‌ణంగా బీజేపీకి అద‌న‌పు బ‌లం చేకూరింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

134 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన పార్టీకి గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా నాయ‌క‌త్వ లేమితో కొట్టుమిట్టాడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం పార్టీ పీక‌ల‌లోతుకు కూరుకు పోయింద‌ని దీనిని ఆదుకునే వారు ఎవ‌రూ లేర‌ని పేర్కొన్నారు గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad).

పార్టీలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌ని ఆరోపించారు. చ‌ర్చ‌లు, అభిప్రాయాలు, ఆలోచ‌న‌ల‌కు గ‌తంలో తావుండేద‌ని కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు.

కేవ‌లం ఏఐసీసీకి సోనియా గాంధీ నామ‌మాత్రంగానే ఉన్నార‌ని మొత్తం రాహుల్ గాంధీ పేరు మీదే న‌డుస్తోంద‌ని ఆరోపించారు ఆజాద్.

Also Read : ఆజాద్ ఆరోప‌ణ‌లు అవాస్త‌వం – జైరాం

Leave A Reply

Your Email Id will not be published!