Assam CM : కాంగ్రెస్ లో మిగిలేది గాంధీలు ఒక్క‌రే

ఇంకెవ‌రూ పార్టీలో ఉండ‌ర‌న్న హిమంత

Assam CM :  అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ(Assam CM)  షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన గులాం న‌బీ ఆజాద్ గుడ్ బై చెప్పారు.

ఆయ‌న రాజీనామాపై సీఎం స్పందించారు. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఖాళీ అవుతుంద‌ని కేవ‌లం గాంధీ ఫ్యామిలీ మాత్ర‌మే ఉంటుంద‌న్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడిన పార్టీ మాత్ర‌మే ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు హిమంత బిస్వా శ‌ర్మ‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఎలాంటి బ‌లం అంటూ ఉండ‌ద‌న్నారు.

దీంతో త‌మ పార్టీకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. ఇప్ప‌ట‌కే వ‌రుస‌గా రెండుసార్లు మోదీ(PM Modi) సార‌థ్యంలో బీజేపీ గెలుస్తూ వ‌స్తోంద‌ని ఇక త‌మ‌ను ఎదుర్కోవ‌డం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాని ప‌ని అని చెప్పారు.

రాహుల్ గాంధీది మొద‌టి నుంచి చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అని ఆరోపించారు. ఆయ‌న‌కు రాజ‌కీయాల‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేద‌న్నారు.

50 ఏళ్ల‌కు పైగా పార్టీకి సేవ‌లందిస్తూ అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు నిర్వ‌హించిన గులాం న‌బీ ఆజాద్ రాజీనామా చేయ‌డం ఆ పార్టీకి తీర‌ని లోటుగా అభివ‌ర్ణించారు.

ఒక ర‌కంగా రాహుల్ గాంధీ వ‌ల్ల త‌మ బీజేపీకి మ‌రింత లాభ‌మే త‌ప్పా ఒన‌గూరిన న‌ష్టం ఏమీ లేద‌న్నారు. ఎందుకంటే ఆయ‌న నిర్వాకం వ‌ల్ల‌నే సీనియ‌ర్లు త‌మ పార్టీ వైపు చూస్తున్నారంటూ చెప్పారు.

మొత్తంగా సీఎం హిమంత బిస్వా శ‌ర్మ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ఆజాద్ స‌రే అస‌మ్మ‌తి నేత‌ల దారెటు

Leave A Reply

Your Email Id will not be published!