KL Rahul : పాకిస్తాన్ తో ఓటమి బాధించింది – కేఎల్
షాకింగ్ కామెంట్స్ చేసిన వైస్ కెప్టెన్
KL Rahul : భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో దాయాది పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
సరిగ్గా ఇదే వేదికపై మరో మెగా టోర్నీ ఆసియా కప్ ప్రారంభమైంది. భారత్, బంగ్లా దేశ్, పాకిస్తాన్ , శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ ఆడనున్నాయి. ఈ జట్లతో పాటు కువైట్, యూఏఈ, హాంగ్ కాంగ్ , సింగపూర్ జట్లు కూడా తలపడనున్నాయి.
ఈ జట్లు క్వాలిఫయిర్ లో ఆడతాయి. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన పోరు జరగనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
దాయాదులు తలపడుతున్న సందర్భంగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓడి పోవడం తనను ఎంతగానో బాధకు గురి చేసిందని అన్నాడు.
ఆ అపజయం తనను తీవ్రంగా కలిచి వేస్తోందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జరగబోయే మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు.
మరో వైపు బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ దుమ్ము రేపుతోంది. గత కొంత కాలంగా ఆజమ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్నాడు.
ఇదిలా ఉండగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈసారి రాణిస్తే సరి లేక పోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read : విరాట్ కోహ్లీ ధోనీ ఫోటో వైరల్
'As players and as a team we always look forward to an India vs Pakistan clash,' says #TeamIndia vice-captain @klrahul ahead of #INDvPAK on Sunday.#AsiaCup2022 pic.twitter.com/7mRf1zxjaS
— BCCI (@BCCI) August 26, 2022