Justice UU Lalit Sworn : సీజేఐగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం
49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
Justice UU Lalit Sworn : సర్వోన్నత భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్(Justice UU Lalit) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముంద 48వ సీజేఐగా కొలువు తీరిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ శుక్రవారం పదవీ వీరమణ చేశారు.
ఆయన 16 నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. ఇదిలా ఉండగా న్యాయ స్థానం నుంచి నేరుగా సుప్రీంకోర్టు బెంచ్ కు పదోన్నతి పొందిన రెండో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ నిలిచారు.
జనవరి 1971లో భారత దేశానికి 13వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎస్ఎం సిక్రీ మార్చి 1964లో నేరుగా ఉన్నత న్యాయ స్థానం బెంచ్ కి ఎదిగిన మొదటి న్యాయవాది కావడం విశేషం.
ఇవాళ భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యుయు లలిత్ తో భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరిగింది.
సీనియారిటీ నిబంధనలకు అనుగుణంగా జస్టిస్ ఎన్వీ రమణ తన వారసుడిగా జస్టిస్ లలిత్ ను సిఫార్సు చేశారు. కేంద్రం అంతకు ముందు ఆయనను సీజేఐగా నియమించాలని సూచించింది.
వయస్సు రీత్యా జస్టిస్ యుయు లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు. సీజేఐగా జస్టిస్ లలిత్ నియామకాన్ని రాష్ట్రపతి తదనంతరం ధ్రువీకరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ మాట్లాడారు. మూడు నెలల తన పదవీ కాలంలో ఎక్కువగా మూడు కీలక రంగాలపై ఫోకస్ పెడతానని చెప్పారు. పేరుకు పోయిన కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
Also Read : పెండింగ్ కేసుల పరిష్కారంపై ఫోకస్
Justice UU Lalit sworn in as 49th CJI#JusticeUULalit
Read more: https://t.co/huzQ1ERtiR pic.twitter.com/NZJt4L9Brs
— editorji (@editorji) August 27, 2022