Wasim Jaffer : దాయాదుల పోరులో జాఫ‌ర్ టీం ఇదే

మూడో స్థానంలో కోహ్లీ..సూర్య‌..పాండ్యా

Wasim Jaffer : యూఏఈ వేదిక‌గా మెగా టోర్నీ ఆసియా క‌ప్ ఆగ‌స్టు 27 శ‌నివారం ప్రారంభ‌మైంది. ఆదివారం ఆగ‌స్టు 28న అస‌లైన పోరాటానికి తెర లేప‌నుంది. ఇంకా కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి.

దాయాదుల పోరులో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఇప్ప‌టికే తాజా, మాజీ ఆట‌గాళ్లు అంచ‌నాలు వేస్తున్నారు. ముంద‌స్తుగా ఏ జ‌ట్టు ఎలాంటి బ‌లాన్ని క‌లిగి ఉన్న‌ద‌నే దానిపై అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

రికీ పాంటింగ్ అయితే ఆసియా క‌ప్ లో భార‌త్, పాకిస్తాన్ ఫైన‌ల్ కు చేరుకుంటాయ‌ని జోష్యం చెప్పాడు. ఇక అంద‌రి కళ్లు ఇరు జ‌ట్ల మీదే ఉన్నా పాకిస్తాన్ కు సంబంధించి స్టార్ బౌల‌ర్ ష‌హీన్ అఫ్రిది గాయం కార‌ణంగా త‌ప్పు కోవ‌డం ఆ జ‌ట్టుకు ఇబ్బందిగా మారింది.

మ‌రో వైపు బాబ‌ర్ ఆజ‌మ్(Wasim Jaffer) సార‌థ్యంలోని పాక్ జ‌ట్టు సూప‌ర్ ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఆజ‌మ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. భార‌త్ కు అంత సీన్ లేద‌న్నాడు.

త‌మ‌ను త‌ట్టుకోవ‌డం ఈజీ కాద‌న్నాడు. ఈ స‌మ‌యంలో రేప‌టి పాక్ తో పోరు కు తుది జ‌ట్టును అంచ‌నా వేశాడు మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్. ఇదిలా ఉండ‌గా రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ ను ఓపెన‌ర్స్ గా ఎంచుకున్నాడు.

ఇక కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్, పాండ్యాల‌కు త‌ర్వాతి స్థానాలు కేటాయించాడు. ఇక ఓవ‌రాల్ గా ఇలా ఉంది జ‌ట్టు. రోహిత్ శ‌ర్మ‌, కెప్టెన్, రాహుల్, కోహ్లి, సూర్య‌, పాండ్యా, పంత్ లేదా కార్తీక్, జ‌డేజా, చాహ‌ల్ , బిష్నోయ్ , భువనేశ్వ‌ర్ కుమార్ , అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు.

Also Read : మాతో ఆడ‌టం కోహ్లీకి అగ్నిప‌రీక్ష‌

Leave A Reply

Your Email Id will not be published!