Governors System Comment : గాడి తప్పిన గవర్నర్ల వ్యవస్థ
బీజేపీయేతర ప్రభుత్వాల ఆగ్రహం
Governors System Comment : ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరొందింది భారత దేశం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాసిన రాజ్యాంగం ఇప్పుడు పాలకులకు ఓ ముడి సరుకుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఏర్పడిన ఈ దేశం ఇప్పుడు ఆరోపణలు , ప్రత్యారోపణలు తో అట్టుడుకుతోంది. ప్రధానంగా ఆనాటి కాంగ్రెస్ కాలం నుంచి నేటి మోదీ ఏలుతున్న కాలం దాకా అన్నీ ఆరోపణలు, లెక్కలేనన్ని విమర్శలు.
గవర్నర్ ఎప్పుడూ రాజ్యాంగానికి సేఫ్ గార్డ్ గా ఉండాలే తప్పా కూల్చేందుకు ఓ పనిముట్టు కాకూడదని ఇప్పటికే సెలవిచ్చారు మేధావులు.
కానీ రాను రాను గవర్నర్ వ్యవస్థ పూర్తిగా రాజకీయాలకు కేరాఫ్ గా మారింది.
వయస్సు మళ్లిన వారిని, పార్టీలో ఎందుకూ ప్రాధాన్యత లేని వారిని చివరి దశలో గవర్నర్ల పదవులు అప్పగించే సాంప్రదాయం ఇరు పార్టీలలోనూ ఉంది.
ఇది పక్కన పెడితే గతంలో ఎన్నడూ లేనంతగా నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 2014లో కొలువు తీరిందో
ఆనాటి నుంచీ 2022 దాకా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఒకానొక దశలో ఇదే మోదీ సర్కార్ కు చెందిన మేఘాలయ గవర్నర్ మాలిక్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన వారైనా ఆయన ప్రజల పక్షం వహించారు.
ఇక మోదీ త్రయం ( మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) లక్ష్యం ఒక్కటే. ఒకే దేశం..ఒకే పార్టీ..ఒకే మతం..ఒకే సిద్దాంతం..ఒకే భాష. అందులో భాగంగానే ప్లాన్ చేసుకుంటూ వస్తోంది.
ప్రధానంగా గత ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీయేతర పార్టీలు కొలువు తీరిన రాష్ట్రాలను టార్గెట్ చేసింది. అంత కంటే కూల్చడంలోనే ఎక్కువగా నిమగ్నమైంది కేంద్ర సర్కార్.
దీనికి అంది వచ్చిన అవకాశం కేవలం గవర్నర్ల వ్యవస్థ కొలువు తీరి ఉండడమే. దీనిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి విపక్షాలు. ఏకమై గొంతు విప్పినా మోదీ డోంట్ కేర్ అంటున్నారు.
రాజ్యాంగాన్ని రక్షిస్తూ..పరిరక్షిస్తూ ప్రజా పాలనకు సూచనలు, సలహాలు, మార్గదర్శకంగా ఉండాల్సిన గవర్నర్లు(Governors System) ఫక్తు రాజకీయ
పార్టీలకు ప్రతినిధులుగా మారి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి.
బీజేపీ ఏలుబడిలో ఉన్న గవర్నర్లు మాత్రం కామ్ గా ఉన్నప్పటికీ బీజేపీయేతర పార్టీలు కొలువు తీరిన రాష్ట్రాలలో అట్టుడుకుతున్నాయి. గవర్నర్లు వర్సెస్ ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
ప్రధానంగా తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్(Governors System) ఆర్ఎన్ రవి, తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , గతంలో పశ్చిమ బెంగాల్ సిఎం దీదీ వర్సెస్ ధన్ ఖర్ ( ప్రస్తుతం వైస ప్రెసెడింట్ ) , మహారాష్ట్రలో గవర్నర్ కోషియార్ , కేరళలో సీఎం విజయన్
వర్సెస్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య యుద్దం నడుస్తూనే ఉంది.
ఇక తాజాగా జార్ఖండ్ లో మరో రాజకీయ సంక్షోభానికి తెర లేపారు గవర్నర్ . ఏకంగా సీఎం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. మరో వైపు ఢిల్లీలో సీఎం
వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అగాధం ఏర్పడింది.
చివరకు గవర్నర్లు ఉండాలా వద్దా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరి నిర్వాకం వల్ల. ఏది ఏమైనా గవర్నర్లు పార్టీలకు అతీతంగా రాజ్యాంగానికి నిబద్దులై ఉండాలి.
ప్రభుత్వాలకు అనుసంధానకర్తలుగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. సమాఖ్య రాజ్య భావనకు సార్థకత చేకూరుతుంది.
Also Read : కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పిండు