ICC Media Rights : రూ. 24 వేల కోట్లకు ఐసీసీ మీడియా రైట్స్
కొనుగోలు చేసిన డిస్నీ హాట్ స్టార్
ICC Media Rights : భారత దేశం అంటేనే క్రికెట్. ఇక్కడ క్రికెట్ అన్నది ఆట కాదు ఓ మతంగా భావిస్తారు. 133 కోట్ల భారతీయుల భావోద్వేగాలు ఇందులో మిళితమై ఉంటాయి.
అందుకే అంత క్రేజ్. దేశానికి చెందిన జాతీయ పతాకాలు రెప రెప లాడుతాయి. అంతలా దానితో మమేకమై ఉండడంతో కోట్లాది రూపాయలు క్రికెట్ ను నియంత్రిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి వచ్చి చేరుతున్నాయి.
ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత విలువ, ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా టాప్ 5లో నిలిచింది. తాజాగా భారత్ లో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే అన్ని మ్యాచ్ లకు సంబంధించి బిడ్ నిర్వహించింది.
మొత్తం మ్యాచ్ లకు చెందిన ప్రసారాలను ప్రపంచ దిగ్గజ మీడియా సంస్థగా ఇప్పటికే టాప్ లో ఉన్న డిస్నీ హాట్ స్టార్(ICC Media Rights) స్వంతం చేసుకుంది. ఇది మరో రికార్డు అని చెప్పక తప్పదు.
ఇప్పటికే బీసీసీఐ ఐదేళ్ల కాలానికి నిర్వహించిన ప్రసార హక్కుల్ని కూడా హాట్ స్టార్ చేజిక్కించుకుంది. డిస్నీ హాట్ స్టార్ కైవసం చేసుకున్న విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
మొత్తం ఈ హక్కుల్ని నాలుగు సంవత్సరాల (2024 -2027) వరకు స్వంతం చేసుకుందని తెలిపింది. ఇదిలా ఉండగా టీవీతో పాటు డిజిటల్ రైట్స్ ను కూడా డిస్నీ స్టార్ చేజిక్కించు కోవడం విశేషం.
ఇందు కోసం నాలుగేళ్ల ఒప్పందానికి గాను రూ. 3 బిలియన్ డాలర్లు అంటే భారతీయ రూపాయలలో రూ. 24 వేల కోట్లు . గత హక్కుల కంటే ఈసారి దాని ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం.
Also Read : దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో