India Slams China : లంకకు మద్దతు కావాలి ఒత్తిడి కాదు
చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్
India Slams China : శ్రీలంకలోని ఓడ రేవు హంబన్ టోటాకు చైనా పరిశోధన నౌక చేరుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం శ్రీలంకపై ఒత్తిడి తెచ్చిందంటూ చైనా చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పు పట్టింది.
చైనా ప్రతిపాదనలను తిరస్కరించింది. భద్రతా సమస్యల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సాయం పేరుతో మరో దేశంపై ఒత్తిడి పెంచడం చైనాకు అలవాటుగా మారిందని, దీనిని సాయం అనరని ఆక్రమణ చేసుకోవడం అంటారని పేర్కొంది భారత ప్రభుత్వం.
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకు పోయిన ద్వీప దేశం శ్రీలంకకు(Srilanka) కావాల్సింది ఆయుధాలు లేదా మిస్సైళ్లు, ఓడలు కావని వెల్లడించింది.
సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ముందు రావాలే తప్పా వారి ఇబ్బందులను లేదా సంక్షోభాన్ని అలుసుగా చేసుకుని ఒత్తిళ్లకు దిగడం ఏ దేశానికి మంచిది కాదని మండిపడింది.
ఇది పూర్తిగా చైనా దుందుడుకు స్వభావాన్ని తెలియ చేస్తుందని కుండ బద్దలు కొట్టింది. ఇదిలా ఉండగా చైనాకు చెందిన నౌక ఆగస్టు 16న దక్షిణ శ్రీలంక లోని హంబన్ తోట ఓడ రేవుకు చేరుకుంది.
దీని ఉద్దేశం భారత దేశం మిస్సైళ్లను, ఇతర ఆయుధాలను నిశితంగా గమనించేందుకేనని అక్కడ మోహరిచిందంటూ భారత్(India Slams China) ఆరోపిస్తోంది.
చైనా రాయబారి చేసిన కామెంట్స్ ను మేం గుర్తించాం. ప్రాథమిక దౌత్య పరమైన మర్యాదాలను కావాలనే ఉల్లంఘించారంటూ ఆరోపించింది భారత్.
కాగా ఎటువంటి ఆధారాలు లేకుండా భద్రతా పరమైన ఆందోళనతో భారత్ శ్రీలంకపై ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తోందంటూ చైనా ఆరోపించింది. దీనిని భారత్ ఖండించింది.
Also Read : కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పిండు