Jharkhand Crisis : జార్ఖండ్ సంక్షోభం బోట్ రైడ్ లో సీఎం

హేమంత్ సోరేన్ ఎమ్మెల్యే స‌భ్య‌త్వం ర‌ద్దు

Jharkhand Crisis : గ‌వ‌ర్న‌ర్ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌డంతో జార్ఖండ్ లో సంక్షోభం తారా స్థాయికి(Jharkhand Crisis)  చేరింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఎలాగైనా స‌రే స‌ర్కార్ ను కూల్చాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. ప్ర‌ధాని ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది ప్ర‌భుత్వేత‌ర ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టారు.

ఇది ఆయ‌న కెరీర్ లో ఓ రికార్డు గా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతానికి హేమంత్ సోరేన్ సంకీర్ణ స‌ర్కార్ కు వ‌చ్చిన ముప్పేమీ లేక పోయినా సీఎంగా ఆరు నెల‌ల కాలం పాటు ఉంటారు.

అంత‌లోపు సోరేన్ త‌న నిర్దోశిత్వాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది. ఆయ‌న కేబినెట్ రాజీనామా చేస్తుందా లేక కంటిన్యూ అవుతారా అన్న‌ది తేలాల్సి ఉంది.

ప్ర‌భుత్వాన్ని కూల్చాలంటే కోట్లాది రూపాయ‌లు వెద‌జల్లాల్సి ఉంటుంది. ఇందుకు బీజేపీ వ‌ద్ద లెక్క‌కు లేనంత డ‌బ్బులు ఉన్నాయి. ఈ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం సుల‌భ‌మే.

అందుకే ముందు జాగ్ర‌త్త‌గా హేమంత్ సోరేన్ త‌న ఎమ్మెల్యేలంద‌రినీ బ‌స్సుల్లో రిసార్ట్ ల‌కు త‌ర‌లించారు. ఓ వైపు రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలో హాయిగా సీఎం బోట్ రైడ్ లో త‌న వారితో క‌లిసి విహ‌రించారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మ‌రాయి. ఈ బోట్ షికారులో ఎమ్మెల్యేలు హాయిగా , ఆహ్లాద‌క‌రంగా ఉండ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే ఈ సీన్ ను చూసి బీజేపీ విస్తు పోతోంది.

Also Read : మాజీ ఎంపీ ఎంఏ ఖాన్ కాంగ్రెస్ కు రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!