Virat Kohli : అరుదైన రికార్డ్ కు చేరువలో రన్ మెషీన్
మూడు ఫార్మాట్ లలో 100వ మ్యాచ్
Virat Kohli : ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లలో ఒకడిగా పేరొందాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). ప్రస్తుతం అరుదైన ఘనత వహించేందుకు రెడీగా ఉన్నాడు.
భారతీయ క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని నమోదు చేసేందుకు సిద్దమయ్యాడు. మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20) లలో కలిపి ఇప్పటి వరకు 99 మ్యాచ్ లు ఆడాడు.
ఇవాళ 100వ టెస్టు ఆడిన 12వ భారత ఆటగాడిగా అవతరించాడు. టి20 ఫార్మాట్ లో 3 వేలకు పైగా పరుగులు సాధించాడు. విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ పై దుమ్ము రేపాడు.
ప్రతి మ్యాచ్ లోనూ సత్తా చాటాడు. 2011లో వెస్టిండీస్ పై అరంగేట్రం చేసినప్పటి నుంచి 50 శాతం సగటుతో వేల పరుగులను సాధించి బలాన్ని పెంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ డజన్ల కొద్దీ రికార్డులను సృష్టించాడు. ఈ రన్ మెషీన్ భారత దేశాన్ని ఏడేళ్ల పాటు విజయవంతంగా నడిపించాడు. మూడు ఫార్మాట్ లలో 50 శాతానికి పైగా సాధించడం మామూలు విషయం కాదు.
ఎన్నో మలుపులు మరెన్నో రికార్డులు అతడిపై నమోదై ఉన్నాయి. విచిత్రం ఏమటంటే టన్నుల కొద్దీ పరుగులను సాధిస్తూ వస్తున్న ఈ అరుదైన క్రికెటర్ ఇప్పుడు డిఫెన్స్ ఆడడం విస్తు పోయేలా చేస్తోంది అభిమానులను .
గత కొంత కాలంగా ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకానొక దశలో ఆసియా కప్ కు ఎంపిక అవుతాడా కాడా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
ఈ తరుణంలో సమూహంలో ఉన్నా తాను ఒంటరిగానే ఉన్నానని కోహ్లీ పేర్కొనడం తను ఎంతలా టెన్షన్ కు గురవుతున్నాడో చెప్పకనే చెబుతోంది.
Also Read : దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో