Kapil Dev : భారత్ బలంగా ఉంది కానీ చెప్పలేం
షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
Kapil Dev : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ జట్ల(IND vs PAK) మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
టీమిండియా గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉందన్నారు. గత ఏడాది 2021 లో టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది.
10 వికెట్ల తేడాతో గెలవడం దారుణంగా భారత్ ఓడిపోవడంతో ప్రస్తుతం జరిగే కీలక మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. విరాట్ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు కెప్టెన్సీ మారాక ప్రస్తుతం భారత్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది.
గణనీయమైన మార్పులను చూసింది. పలువురు యంగ్ క్రికెటర్లు జట్టులో చేరారు. గతంలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సిద్దమవుతోంది టీమిండియా.
కాగా టీమ్ కాగితంపై బలంగానే కనిపిస్తోందని కానీ మైదానంలోకి దిగాక చేపట్టే ప్రదర్శన ఆధారంగానే ఫలితం ఆధారపడి ఉంటుందన్నారు కపిల్ దేవ్ నిఖంజ్(Kapil Dev) .
గత ఏడాది కూడా ఇలాగే ఉందని కానీ ఆఖరున చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్డే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయగలం.
కానీ టి20 మ్యాచ్ విషయంలో ఏ జట్టు చివరకు విజయం సాధిస్తుందనే విషయం చెప్పలేమన్నాడు కపిల్ దేవ్. ఎందుకంటే బంతికీ బ్యాట్ కు మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతుందన్నాడు.
అటు వైపు పాకిస్తాన్ కూడా సమర్థవంతంగా ఆడుతోందన్నారు. ఇరు జట్లకు గెలిచేందుకు ఆస్కారం ఉందన్నారు కపిల్ దేవ్.
Also Read : భారత ఆటగాళ్ల స్నేహానికి పాక్ కెప్టెన్ ఫిదా