Smriti Van Comment : మాన‌ని గాయం ‘స్మృతి వాన్’ కు స‌లాం

ఆనాటి భూకంపానికి 21 ఏళ్లు

Smriti Van Comment :  ఏమిటీ స్మృతి వాన్ అనుకుంటున్నారా. దాని గురించి తెలుసు కోవాలంటే 21 ఏళ్లు వెన‌క్కి వెళ్లాలి. ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌లో ఇది ఒక‌టి.

స‌రిగ్గా 2001లో గుజ‌రాత్ లోని భుజ్ స‌మీపంలో భారీ భూకంపం సంభ‌వించింది. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 13,000 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

శిథిలాల కింద న‌లిగి పోయారు. ఆన‌వాళ్లు లేకుండా పోయారు. మాన‌వ చ‌రిత్ర ప‌రిణామ క్ర‌మంలో భార‌త దేశ ప‌రంగా అత్యంత హృద‌య విదార‌క సన్నివేశం అది.

ఈ ఘ‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వేలాది మంది శ‌వాల కుప్పులుగా భూమిలో క‌లిసి పోయారు. భారీ భూకంపం దెబ్బ‌కు చెల్లా చెదురుగా మారి పోయారు.

ఆనాటి భూకంపం దెబ్బ‌కు గుజ‌రాత్ విల‌విల‌లాడింది. దేశం యావ‌త్తు త‌ల్ల‌డిల్లింది. యావ‌త్ లోకం తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత తిరిగి జ్ఞాప‌కానికి తెచ్చుకునేలా చేశారు.

ఆనాటి దుర్ఘ‌ట‌న‌లో, ప్ర‌కృతి విధ్వంసానికి నేల‌రాలిన వారంద‌రినీ గుర్తు పెట్టుకునేలా , నివాళులు అర్పించేలా చేశారు. ఈ కీల‌క స‌మ‌యంలో కాలం గాయ‌ప‌రిచేలా చేస్తుంది.

అదే స‌మ‌యంలో ఆ గాయాల‌ను మ‌రిచి పోయేలా చేస్తుంది. కానీ ఇలాంటి ఘ‌ట‌న‌లు కొన్ని మాత్రం ఎల్ల‌ప్ప‌టికీ గాయ‌ప‌రుస్తూనే ఉంటాయి.

ఇది అత్యంత బాధాక‌ర‌మైన సన్నివేశం. ఆనాటి దారుణ‌మైన ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌తి ఒక్క‌రిని గుర్తు పెట్టుకునేలా గుజ‌రాత్ లోని భుజ్ ప్రాంతంలోని క‌చ్ లో స్మృతి వాన్ ను (Smriti Van) నిర్మించింది.

479 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. నేటి త‌ర‌మే కాదు రాబోయే త‌రాలు సైతం నిత్యం స్మ‌రించుకునేలా, జ్ఞాపకం చేసుకునేలా, నివాళులు అర్పించేందుకు వ‌స‌తులు క‌ల్పించారు.

న‌డుస్తున్న చ‌రిత్ర‌లో నిత్యం స్మ‌రించుకునే అవ‌కాశం ద‌క్క‌డం మామూలు విష‌యం కాదు. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆగస్టు 28 ఆదివారం

2022న ప్రారంభించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాని పేర్కొన్న‌ట్లు భూకంప బాధితుల కోసం స్మృతి వాన్(Smriti Van) స్మార‌కాన్ని ఏర్పాటు చేయ‌డం పోరాట ప‌టిమ‌ను కోల్పోయిన వారికి నిజ‌మైన నివాళి అని పేర్కొన్నారు.

ఏది ఏమైనా ఈనాడు వారంద‌రూ ప్రాణాల‌తో లేక పోవ‌చ్చు. కానీ వారు ఈ దేశ భూమిలో ఉన్న‌ట్టే లెక్క‌. స్మృతి వాన్ కు స‌లాం చేద్దాం. నివాళులు అర్పిద్దాం.

Also Read : 8వ త‌ర‌గ‌తి పాఠంలో సావ‌ర్క‌ర్ ప్ర‌స్తావ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!