Rohit Sharma : మేం గెలుస్తామ‌ని ముందే తెలుసు – కెప్టెన్

భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ

Rohit Sharma : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన కీల‌క‌మైన ఆసియా క‌ప్ 2022 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో టెన్ష‌న్ సాగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 19.5 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంత‌రం బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవ‌ర్ల‌లో టార్గెట్ చేసింది.

ఈ విజ‌యంలో హార్దిక్ పాండ్యా కీల‌క పాత్ర పోషించాడు. పాకిస్తాన్ పై గెలుపొందిన అనంత‌రం భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) మీడియాతో మాట్లాడారు. తాము ముందే గెలుస్తాన‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు.

బౌల‌ర్లు, బ్యాట‌ర్లు అంతా స‌మిష్టిగా రాణించామ‌ని చెప్పాడు. భువనేశ్వ‌ర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్బుతంగా బౌలింగ్ చేశాడ‌ని ప్ర‌శంసించాడు. అంతే కాకుండా 25 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు పాండ్యా.

ఆపై టార్గెట్ ఛేద‌న‌లో 17 బంతులు ఎదుర్కొని 33 కీల‌క‌మైన ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జ‌ట్టు విజ‌యంలో అద్భుత‌మైన పాత్ర పోషించాడంటూ కొనియాడారు.

మ్యాచ్ ప్రారంభం కంటే ముందే ఓ అంచ‌నాకు వ‌చ్చాం. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు న‌రాలు తెగే ఉత్కంఠ కొన‌సాగింద‌న్నాడు. ఈ మ్యాచ్ చివ‌రి బంతి దాకా కొన‌సాగుతుంద‌ని అనుకోలేద‌ని పేర్కొన్నాడు రోహిత్ శ‌ర్మ‌.

ఈ మ్యాచ్ ను తాము ప్ర‌త్యేకంగా ఎప్పుడూ చూడలేద‌న్నాడు. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని దానిని తాము లైట్ గా తీసుకుంటామ‌న్నాడు హిట్ మ్యాన్.

కాగా ఈ మ్యాచ్ ను తాను ప్ర‌తీకారంగా భావించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : ఆట కంటే నాకు దేశం ముఖ్యం – పాండ్యా

Leave A Reply

Your Email Id will not be published!