Ghulam Nabi Azad : అరుదైన జ్ఞాపకం మోదీతో స్నేహం – ఆజాద్
ప్రధాన మంత్రి అయినా ఆదరణ గ్రేట్
Ghulam Nabi Azad : ఒకరు కరుడు గట్టిన హిందూత్వ వాది. మరొకరు అందుకు పూర్తిగా విరుద్దమైన వ్యక్తి. మరి వీరిద్దరూ ప్రస్తుతం వేర్వేరు పార్టీలు, వేర్వేరు స్థానాలలో ఉన్నారు.
ఇద్దరూ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వారే. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). మరొకరు 50 ఏళ్ల పాటు అనుబంధం కలిగిన మాజీ సీఎం,
మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) గుడ్ బై చెప్పారు. ఇద్దరూ పార్లమెంట్ సమావేశాల్లో కలుసుకున్నారు. కానీ ఏనాడూ పరిధులు దాటలేదు. పరిమితులు ఏమిటో గుర్తించారు.
ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించ లేదు ఆజాద్ కు కాంగ్రెస్ పార్టీ. దీంతో ఆయన గత కొంత కాలం నుంచీ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మరో జి23 పేరుతో పార్టీలోనే వేరు కుంపటి పెట్టారు. దీనిని జీర్ణించు కోలేక పోయారు రాహుల్ గాంధీ. ఇది పక్కన పెడితే రాజ్యసభలో ఆయన పదవీ విరమణ సందర్బంగా ప్రధాన మంత్రి ఆజాద్ ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని తెలియ చేశారు.
తమ వారికి కష్టం వచ్చిన సమయంలో ఆయన జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఎలా సేవ్ చేశారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆజాద్ ను గొప్ప పార్లమెంటేరియన్ అంటూ కితాబు ఇచ్చారు ప్రధాన మంత్రి.
ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నప్పటికీ ఏ ఒక్క అవార్డు రాలేదు ఆజాద్ కు. కానీ బీజేపీ సంకీర్ణ సర్కార్ హయాంలో ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.
ఈ సందర్భంగా సోమవారం మోదీతో తనకున్న అనుబంధం గురించి జ్ఞాపకం చేసుకున్నారు ఆజాద్.
Also Read : రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదు