Mansukh Mandaviya KTR : కేటీఆర్ వ‌న్నీ అబ‌ద్దాలు – మాండ‌వ్య‌

మెడిక‌ల్ కాలేజీల ప్ర‌తిపాద‌న‌లు రాలేదు

Mansukh Mandaviya KTR : తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండ‌వ్య‌(Mansukh Mandaviya). ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ చేసిన ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌ని పేర్కొన్నారు.

మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు చేయ‌కుండా ఎలా మంజూరు చేస్తార‌ని ప్ర‌శ్నించారు మాండ‌వ్య‌. ఇదిలా ఉండగా మోదీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజీ చేయ‌డంలో వివ‌క్ష చూపుతున్నారంటూ ఆరోపించారు.

పూర్తిగా మంత్రివ‌న్నీ అబ‌ద్దాలేనంటూ మండిప‌డ్డారు మాండవ్య‌. ప‌క్ష‌పాతం లేకుండా అత్య‌ధిక వైద్య క‌ళాశాల‌ల‌ను ప్ర‌ధాని మోదీ మంజూరు చేశార‌ని ఆరోగ్య మంత్రి వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిది ఏళ్ల‌వుతున్నా ఈరోజు వ‌ర‌కు స‌ర్కార్ నుంచి ఎలాంటి ప్ర‌తిపాదన‌లు రాలేద‌న్నారు మాన్సూఖ్ మాండ‌వ్య‌.

ఇదిలా ఉండ‌గా సీఎం కేసీఆర్ ఐటీ కేటీఆర్ వ‌రుస ట్వీట్ల‌లో 16 మెడిక‌ల్ కాలేజీల‌ను మంజూరు చేశార‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని ఆరోపించారు కేటీఆర్(KTR).

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు ఇచ్చింది ఏమీ లేదు సున్నా. ఈ సంద‌ర్భంగా మాండ‌వ్య ఎన్ని ప్ర‌తిపాద‌న‌లు పంపించారో చెప్పాల‌ని స‌వాల్ చేశారు.

ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా అతి త‌క్కువ స‌మ‌యంలో అత్య‌ధిక ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌ను ప్ర‌ధాన మంత్రి మోదీ(PM Modi) మంజూరు చేశార‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

2015, 2019 సంవ‌త్స‌రాల‌లో వ‌రుస‌గా మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు ప్ర‌తిపాన‌ద‌లు పంపించాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని  కేంద్ర మంత్రి  మాన్సుఖ్ మాండ‌వ్య వెల్ల‌డించారు.

Also Read : ఐకియా నిర్వాకం కేటీఆర్ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!