SBI Slashes : తగ్గిన ఎస్బీఐ వృద్ధి అంచనా రేటు
పడిపోతున్న ద్రవ్యోల్బణానికి పరాకాష్ట
SBI Slashes : ఓ వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారు దేవ్ రాయ్ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందంటూ చిలుక పలుకులు పలికారు. కానీ మరో వైపు వాస్తవంగా చూస్తే దారుణంగా ఉంది పరిస్థితి.
దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా పేరొందింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). ఈ ఏడాదికి సంబంధించి వృద్ది అంచనాను సదరు బ్యాంకు 7 శాతం దిగువకు తగ్గించింది(SBI Slashes).
ఇది దిగులుగా ఉన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. 2023కి సంబంధించి 7.5 శాతం నుండి 6.8 శాతానికి తగ్గించింది ఎస్బీఐ. ఇది అత్యంత ప్రమాదకరమైన దిగజారిన ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ క్యూ1 వృద్ది సంఖ్యలను విడుదల చేసింది. ఇది 13.5 శాతం ఏకాభిప్రాయ వృద్దిని చూపింది. తయారీ రంగానికి సంబంధించి పేలవమైన ప్రదర్శన కారణంగా దిగువకు పడి పోయింది.
మూడు నెలల్లో 4.8 శాతం విస్తరణను స్వల్పంగా నివేదించింది. ఇక ఏకాభ్రిపాయ అంచనా 15 నుంచి 16.7 శాతంగా ఉంది. ఆర్బీఐ అత్యధికంగా 16.7 శాతం అంచనా వేసింది.
తొలి త్రైమాసికంలో 15.7 శాతం వృద్దిని నమోదు చేయొచ్చంటూ ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అంచనా వేశారు. స్థూల విలువ జోడింపు (జివిఏ) నుండి ఆర్థిక వ్యవస్థ అంచనా కంటే చాలా తక్కువగా ఉంది.
12.7 శాతం మాత్రమే లాగిన్ అయ్యింది. ఇక 13.5 శాతం వద్ద వాస్తవ జీడీపీ వృద్ది క్రమంగా 9.6 శాతం మేర క్షీణించంది. అయితే ఆయా సంస్థలు అసలు విషయాలు దాచి పెడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
Also Read : రష్యన్ ఆయిల్ చీఫ్ రవిల్ మగనోవ్ మృతి