Mohammed Hafeez : రోహిత్ శర్మపై హఫీజ్ షాకింగ్ కామెంట్స్
ఎక్కువ కాలం కెప్టెన్ గా కొనసాగడు
Mohammed Hafeez : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్(Mohammed Hafeez) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన హోరా హోరీ పోరులో భారత్ గెలిచినా ఆశించిన మేర కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేక పోయాడు.
దీనిపై స్పందించాడు. ఒక వేళ పాకిస్తాన్ గనుక మరో 10 లేదా 20 పరుగులు చేసి ఉండి ఉంటే భారత జట్టు కచ్చితంగా ఓడి పోయి ఉండేదన్నాడు.
ఇదిలా ఉండగా ఆసియా కప్ ప్రారంభమైనా చెప్పుకోదగిన స్కోర్ చేయలేక పోయాడు రోహిత్ శర్మ. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశాడు. కేవలం 12 రన్స్ మాత్రమే చేశాడు..
ఇక పసికూనలని అనుకున్న హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 21 రన్స్ చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ గా విజయం సాధించినా వ్యక్తిగతంగా రాణించలేక పోయాడు. దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించాడు మహ్మద్ హఫీజ్(Mohammed Hafeez) .
కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాక వ్యక్తిగతంగా పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడని, ఇక ఎక్కువ కాలం నాయకుడిగా ఉండక పోవచ్చని అభిప్రాయ పడ్డాడు మహ్మద్ హఫీజ్.
అంతే కాదు భారత జట్టు ఇటీవల ఇంగ్లండ్, విండీస్ తో జరిగిన మ్యాచ్ లలోనూ ఆశించినంత మేర రాణించ లేక పోయాడు. పీటీవీ స్పోర్స్ తో మహ్మద్ హఫీజ్ మాట్లాడాడు.
ఎందుకనో మునుపటి జోరు కనిపించడం లేదన్నాడు. రన్స్ చేసేందుకు భయపడుతున్నాడని ఇది ఒక స్టార్ ప్లేయర్ కు తగదన్నాడు. హాంకాంగ్ పై గెలిచినా రోహిత్ మోములో సంతోషం కనిపించ లేదన్నాడు.
తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నాడు హఫీజ్.
Also Read : ‘కిషోర్’ దా భవనంలో కోహ్లీ రెస్టారెంట్