Serial Killer Comment : ఏమిటీ ‘సీరియ‌ల్ కిల్ల‌ర్’ వెనుక క‌థ‌

దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది

Serial Killer Comment :  దేశ మంత‌టా ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్ప‌టి నుంచే మొద‌లైంది. ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగేందుకు. కానీ పార్టీల‌న్నీ ఎన్నిక‌ల జ‌పం చేస్తున్నాయి.

జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేసే ప‌నిలో ఉన్నాయి. లెక్క‌కు మించి పార్టీలు కొలువు తీరి ఉన్నాయి. ఒక‌ప్పుడు భార‌త దేశం అంటే కాంగ్రెస్ పేరు ఎక్కువ‌గా వినిపించేది. రాను రాను మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా ప‌లు పార్టీలు పుట్టుకొచ్చాయి.

కాంగ్రెస్ ఒంటెద్దు పోక‌డ చివ‌ర‌కు త‌న‌ను తాను కోలుకోలేని స్థితికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఆ పార్టీ జ‌వ‌స‌త్వాలు కోల్పోయి నానా తంటాలు ప‌డుతోంది.

స‌రికొత్త నినాదాల‌తో పార్టీలు ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నాయి.

ప్ర‌జ‌ల‌కు తాయిలాలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టాయి. ఎవ‌రి దారి వారిదే అయినా అంతిమంగా అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా మారింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ 

పార్టీతో పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ , ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం, 

శివ‌సేన‌, టీడ‌పీ, స‌మాజ్ వాది పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం, ఏఐడీఎంకే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పార్టీలు ఉన్నాయి.

చాంతాడంత లిస్టు అవుతుంది. ప్ర‌స్తుతం సంకీర్ణ రాజ్యంగా మారి పోయింది భార‌త దేశం. ఏ ఒక్క పార్టీ పూర్తిగా ప‌వ‌ర్ లోకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. గ‌తంలో

కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏర్పాటు చేసినా ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ఉన్న‌ది.

తాజాగా బీజేపీ అధికారంలో ఉన్నా ఇత‌ర పార్టీల‌తో క‌లిసి కొలువు తీరింది. బీజేపీ మోదీని ముందు పెట్టి ఎన్నిక‌ల్లోకి వెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు ఆ పార్టీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా.

ఇదే స‌మ‌యంలో ఆమ్ ఆద్మీ పార్టీ , టీఎంసీలు పోటా పోటీగా త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఇప్ప‌టి నుంచే రేప‌టి కోసం అడుగులు 

వేస్తున్నాయి. ఆప్ మాత్రం ఒంట‌రిగానే త‌న మార్గాన్ని నిర్దేశించుకుని వెళుతోంది.

దాని బీజేపీకి తామే ప్ర‌త్యామ్నాయం అంటోంది. ఆ పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఆయ‌న

ప్ర‌ధానంగా ప్ర‌ధాన మంత్రి మోదీని టార్గెట్ చేస్తున్నారు.

ప్ర‌భుత్వేర రాష్ట్రాల‌ను కూల్చ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారంటూ ధ్వ‌జమెత్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీరియ‌ల్ కిల్ల‌ర్స్(Serial Killer Comment) కామెంట్స్ అంటూ  పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం ఈ ప‌దం పాపుల‌ర్ గా మారింది. ప్ర‌తిప‌క్షాల‌ను నామ రూపాలు లేకుండా చేయాల‌ని భావిస్తున్న మోదీ గురించే ఆయ‌న ఈ వ్యాఖ్య చేశార‌ని అర్థ‌మ‌వుతుంది.

ఇత‌రులు ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తారు. కానీ సీరియ‌ల్ కిల్ల‌ర్స్ మాత్రం కూల్చుకుంటూ పోతారంటూ ఎద్దేవా చేశారు. ఓ సీరియ‌ల్ ను ఉద్దేశించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌డం విశేషం.

ఏది ఏమైనా రాబోయే ఎన్నిక‌లు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. కేజ్రీవాల్ స‌క్సెస్ అవుతుడా ఆప్ బీజేపీ మ‌ధ్యే పోటీ జ‌ర‌గ‌నుంది. ఏమో కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Also Read : కూల్చే ప‌నిలో కేంద్రం ఫుల్ బిజీ – టీఎంసీ

Leave A Reply

Your Email Id will not be published!