Sourav Ganguly : లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కు దాదా దూరం
తాను పాల్గొనడం లేదన్న బీసీసీఐ బాస్
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 16న జరిగే లెజెండ్స్ లీగ్ క్రికెట్ బెనిఫిట్ మ్యాచ్ లో తాను ప్లేయర్ గా పాల్గొనడం లేదంటూ వెల్లడించాడు.
కాగా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియన్ మహారాజాస్ వరల్డ్ ఎలెవన్ తో తలపడినప్పుడు తన మద్దతును అందిస్తానని చెప్పాడు. లీగ్ ను ఉద్దేశించి బీసీసీఐ బాస్ లేఖరాశాడు.
తన క్రికెట్ సహచరులకు బెనిఫిట్ మ్యాచ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ క్రికెటర్లను మళ్లీ క్రికెట్ మైదానంలోకి తీసుకు రావడం , తర తరాలుగా అభిమానులతో మమేకం కావడం ఒక అద్బుతమైన ఆలోచనగా పేర్కొన్నాడు సౌరవ్ గంగూలీ.
ఇందులో ఆడేందుకు అవకాశం ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నా. కాగా నా వృత్తి పరమైన కట్టుబాట్లు, క్రికెట్ పరిపాలనతో నిరంతర పని ఒత్తిడి కారణంగా ఈ ఆటలో పాల్గొనడం లేదన్నాడు.
ఫ్యాన్స్ ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నారని , స్టేడియం మొత్తం ఫ్యాన్స్ తో నిండి పోతుందుని అనుకుంటున్నట్లు తెలిపాడు. లీగ్ గేమ్ లోని దిగ్గజ ఆటగాళ్లను ఒక చోటకు చేర్చడం ఆనందంగా ఉందన్నాడు.
దీంతో ఉత్సాహ భరితమైన క్రికెట్ ప్రదర్శన ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు బీసీసీఐ బాస్(Sourav Ganguly). కాగా ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తం కపిల్ దేవ్ కు చెందిన ఖుషీ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వనున్నారు. ఆడపిల్లలు, విద్య కోసం దీనిని ఖర్చు చేస్తారు.
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ గా లారా