AUS vs ZIM 3rd ODI : ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే
మూడో వన్డేలో ఘన విజయం
AUS vs ZIM 3rd ODI : వరల్డ్ క్రికెట్ లో టాప్ జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియాకు కోలుకోలేని షాక్ తగిలింది. మూడో వన్డే మ్యాచ్ లో జింబాబ్వే ఘన విజయాన్ని నమోదు చేసింది. బ్రాడ్ ఎవాన్స్ అంతులేని ఆనందానికి గురయ్యాడు.
జింబాబ్వేకు(AUS vs ZIM 3rd ODI) ఎనలేని ఊపునిచ్చింది ఈ గెలుపు. చరిత్ర సృష్టించింది. మిచెల్ స్టార్క్ ను ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై జరిగిన అన్ని ఫార్మాట్ లలో ఈ మ్యాచ్ లో విజయం సాధించడం.
టౌన్స్ విల్లే లోని రివర్ వే స్టేడియంలో మూడో మ్యాచ్ జరిగింది. మొదటగా ఆస్ట్రేలియాను 141 పరుగులకు ఆలౌట్ చేసింది జింబాబ్వే. ఇదే సమయంలో అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించింది.
జింబాబ్వే 39వ ఓవర్ లో మూడు వికెట్లు కోల్పోయి స్కోర్ ను ఛేదించింది. ఎవాన్స్ విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు జట్టు అంతా ఉద్విగ్నానికి లోనైంది. పరుగును పూర్తి చేసేందుకు ముందే అతను తన చేతులను గాలిలోకి పైకి లేపాడు.
ఆస్ట్రేలియా పై విజయం సాధించిన తర్వాత జింబాబ్వే సంబురాలు చేసుకుంది. ఇది ఊహించని సన్నివేశం. అద్భుతంగా ఆడాం. మా ఆటగాళ్లు కలిసి కట్టుగా ఆడారని కితాబు ఇచ్చారని జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకబ్వా చెప్పాడు.
37 నాటౌట్ తో అత్యధిక స్కోర్ చేశాడు. మురుమణి 35 పరుగులు చేసి రాణించాడు. జింబాబ్వే ఒకానొక సమయంలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
వచ్చే ఏడాది భారత దేశంలో జరిగే 50 ఓవర్ల వరల్డ్ కప్ కు అర్హత సాధించే దిశగా జింబాబ్వే అడుగులు వేస్తోంది.
Also Read : ఆసియా కప్ సూపర్- 4 షెడ్యూల్