SL vs AFG Asia Cup 2022 : ఉత్కంఠ పోరులో శ్రీలంకదే హవా
సూపర్ -4లో ఆఫ్గన్ పై ఘన విజయం
SL vs AFG Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022లో అసలైన పోరు ప్రారంభమైంది. బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఇక సూపర్ -4కి భారత్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక చేరుకున్నాయి. తాజాగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆప్గనిస్తాన్ పై శ్రీలంక అద్భుత విజయాన్ని ఆవిష్కరించింది.
కుశాల్ మెండీస్ , భానుక రాజపక్సే కీలకంగా వ్యవహరించారు. ఒకానొక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇక్కట్లలో ఉన్న జట్టును ఒడ్డుకు చేర్చారు.
మెండీస్ దుమ్ము రేపితే రాజపక్సే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో శ్రీలంక ఆఫ్గనిస్తాన్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయం కోసం 176 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంక(SL vs AFG Asia Cup 2022) మరో ఐదు బంతులు ఉండగానే చేరుకున్నారు.
ఇక శ్రీలంక టీమ్ లో పాతుమ్ నిస్సాంక 35 రన్స్ తో సత్తా చాటితే మెండీస్ 36 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్లు శ్రీలంక మిడిల్ ఆర్డర్ ను దెబ్బ తీశారు. కానీ రాజపక్సే 14 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేయడంతో ఆఫ్గనిస్తాన్ ఆశలు వదులుకుంది గెలుపు మీద.
వనిందు హసరంగా కూడా కీలకమైన 16 పరుగులు చేశాడు ఆఖరులో. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 175 రన్స్ చేసింది.
ప్రధానంగా ఆ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్కడే 84 పరుగులు చేసి సత్తా చాటాడు. ప్రారంభంలో రన్స్ చేసిన ఆఫ్గనిస్తాన్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 37 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది.
Also Read : ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే