Sonali Phogat Case : సీబీఐ కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం
సీబీఐ కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం సోనాలీ ఫోగట్ కుటుంబీకుల ప్రకటన
Sonali Phogat Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది హర్యానాకు చెందిన టిక్ టాక్ స్టార్, యాంకర్, భారతీయ జనతా పార్టీ నాయకురాలు సోనాలీ ఫోగట్ హత్య. మొదట అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు ధ్రువీకరించారు పోలీసులు.
ఇందుకు సంబంధించి ఈ కేసులో ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ కేసు అప్పగించాలని మొదటి నుంచీ కోరుతూ వస్తున్నారు కుటుంబీకులు.
ఇప్పటి వరకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. ఈ మేరకు ఖట్టర్ గోవా సీఎం తో ఫోన్ లో మాట్లాడారు. సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఇందుకు గోవా సీఎం కూడా సమ్మతించారు.
కానీ ఇప్పటి వరకు కేంద్ర ఏజెన్సీకి అప్పగించ లేదు. దీంతో కుటుంబీకులు దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై క్లారిటీ వచ్చేంత వరకు తాము ఊరుకోమంటూ స్పష్టం చేశారు.
తాము విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. 43 ఏళ్ల వయస్సులో సోనాలీ ఫోగట్ చని పోవడాన్ని వారు ఇంకా జీర్ణించు కోలేక పోతున్నారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోనాలీ ఫోగట్(Sonali Phogat Case) కు చెందిన మేనల్లుడు, న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్న వికాస్ సింగ్ సీరియస్ అయ్యారు. గోవా పోలీసులు తమకు మద్దతు ఇవ్వడం లేదని , దీని వెనుక రాజకీయ ప్రభావం ఉందని ఆరోపించారు.
సీబీఐ విచారణ కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ కు లేఖ రాశారు.
Also Read : సీరమ్..బిల్ గేట్స్ కు నోటీసులు