MS Dhoni : వ‌చ్చే సీజ‌న్ లోనూ ధోనీనే కెప్టెన్

సీఎస్కే సిఇఓ కాశీ విశ్వ‌నాథ్

MS Dhoni :  వ‌చ్చే ఏడాది 2023లో జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ రిచ్ లీగ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు ఎవ‌రు సార‌థిగా ఉంటార‌నే ఉత్కంఠ‌కు తెర దించింది ఆ జ‌ట్టు యాజ‌మాన్యం.

ఆ మేర‌కు జార్ఖండ్ డైన‌మెంట్ మ‌హేంద్ర సింగ్ ధోనీకే(MS Dhoni)  ప్ర‌యారిటీ ఇస్తూ అత‌డికే సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇదే విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు సీఎస్కే యాజ‌మాన్యం సిఇఓ కాశీ విశ్వ‌నాథ్.

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలిపారు. వ‌చ్చే సీజ‌న్ లో కూడా ధోనీనే స‌రైనోడు అని స్పష్టం చేశారు. త‌మ జ‌ట్టును నాలుగ‌సార్లు ఐపీఎల్ క‌ప్ తీసుకు వ‌చ్చిన అరుదైన ప్లేయ‌ర్ అంటూ కితాబు ఇచ్చారు.

అత‌డు వ‌ద్దు అనేంత దాకా ఆయ‌నే జ‌ట్టుకు కెప్టెన్ గా ఉంటాడ‌ని పేర్కొన్నారు సిఇఓ. ధోనీపై పూర్తి న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు కాశీ విశ్వ‌నాథ్. ఈ ఏడాది 2022 న జ‌రిగిన ఐపీఎల్ లో ధోనీని(MS Dhoni)  మార్చి ర‌వీంద్ర జ‌డేజాకు కెప్టెన్సీ అప్ప‌గించింది మేనేజ్ మెంట్.

కానీ సక్సెస్ కాలేక పోయాడు. దీంతో తిరిగి అనూహ్యంగా అత‌డిని త‌ప్పించింది. చివ‌ర‌కు ధోనీకే మ‌ళ్లీ ప‌గ్గాలు అప్ప‌గించింది. విచిత్రం ఏమిటంటే పాయింట్ల ప‌ట్టిక‌లో ఏకంగా 9వ స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ క‌ప్ ను పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ గెలుపొందింది. ఇక సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.

ఇదిలా ఉండ‌గా దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు మ‌హేంద్ర సింగ్ ధోనీ.

Also Read : సెక్సీ’ ప‌దం వ‌ద్ద ఆగి పోయిన ద్ర‌విడ్

Leave A Reply

Your Email Id will not be published!