Mutt Politics Comment : కన్నడ నాట ‘మఠం’ కలకలం
మతం రాజకీయం ఒక్కటైన వేళ
Mutt Politics Comment : యావత్ దేశం ఇప్పుడు రాజకీయమంతా మతం చుట్టూ తిరుగుతోంది. ఒక రకంగా అది లేకుండా నడిచే పరిస్థితి లేదు. ఎవరికి వారు గ్రూపులుగా, వర్గాలుగా, కులాలు, మతాలుగా విడి పోయి ఉన్నారు.
ఎప్పుడైతే మతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలైందో ఆనాటి నుంచి పాలిటిక్స్ లో వారి ప్రాబల్యం ఎక్కువై పోయింది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. వాళ్ల చుట్టే రాజకీయం నడుస్తోంది. ఇవాళ మఠాధిపతులు, గురువులు, స్వాములు ఆయా పార్టీలకు అనుకూలంగా ఉంటూ
తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
మనది సెక్యులరిజం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్ని మతాలను గౌరవించమని చెప్పారు. కానీ మనుషుల్ని మతాల పేరుతో విడదీయమని ఏనాడూ చెప్పలేదు.
తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కీలకమైన చర్చకు దారితీశాయి. కన్నడ నాట ఏ ప్రభుత్వమైనా కొలువు తీరాలంటే అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన లింగాయత్ లే కీలకం.
ఆ సామాజిక వర్గమే మొదటి నుంచీ ఆధిపత్యం సృష్టిస్తూ వస్తోంది. ఇక్కడ మఠాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకంటే మఠాధిపతులు ఏం చెబితే అదే వేదం..అదే చట్టం..అదే శాసనం.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సో కాల్డ్ పీఠాధిపతులు ప్రభుత్వేతర(Mutt Politics) శక్తులుగా మారారన్న ఆరోపణలు లేక పోలేదు. ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది.
అన్ని పార్టీల నాయకులు మఠాధిపతులను కలుసు కోవడం, వారి ఆశీస్సులు అందుకోవడం షరా మామూలే. వీరిని కాదని ఏ పనీ చేయలేదు ఏ
ప్రభుత్వం కూడా. ఇటీవల చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది.
కర్ణాటక లోని చిత్రదుర్గకు చెందిన మురుగ మఠం మఠాధిపతి బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఆపై సంచలన ఆరోపణలు చేయడంతో కేసు నమోదు చేశారు.
తాను ఏమీ అలాంటి పనులు చేయలేదని సెలవిచ్చారు. కోర్టులో హాజరు పర్చడంతో 14 రోజుల కస్టడీ విధించింది. ఇది పక్కన పెడితే తీవ్ర ఆరోపణలు
తట్టుకోలేక మరో పీఠాధిపతి సూసైడ్ చేసుకోవడం విస్తు పోయేలా చేసింది.
అసలు కర్ణాటకలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. లింగాయత్ సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఆయా మఠాల అధిపతులు.
అందుకే బీజేపీ అయినా లేదా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా సరే వారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేక పోతే ఓట్లు రాలవు. పనులు సాగవు. ప్రభుత్వం నడవదు.
ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా ఎందుకని ఆయా పార్టీలు నోరు మెదపడం లేదన్నది ఇప్పుడు సమాజం అడుగుతున్న ప్రశ్న. వీళ్లు ఎలా ప్రజలకు జవాబుదారీగా ఉండనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని కోరారు. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు ,
మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప ఈ కేసు అబద్దమని మాత్రమే పేర్కొన్నారు.
కేసు నమోదయ్యాక స్థానిక ఎమ్మెల్యే, ఇతర బీజేపీ నేతలు మురగ మఠాధిపతిని కలుసుకున్నారు. మొత్తం ఓటు బ్యాంకులో అత్యధిక ఓటు శాతం లింగాయత్ లే.
ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా మఠాలే కీలకం. అంతలా వారి ప్రాబల్యంలోనే వీరంతా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఇటీవల మఠాన్నిసందర్శించారు. మొత్తంగా ఇప్పుడు మఠాధిపతి విషయంలో ఏం జరుగుతోందన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : కమల్ ఆర్ ఖాన్ కు సిన్హా మద్దతు