Virat Kohli : నేర్చు కోవడంలో బాబర్ ఆజం ఫస్ట్ – కోహ్లీ
పాకిస్తాన్ కెప్టెన్ కు విరాట్ కోహ్లీ కితాబు
Virat Kohli : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). గతంలో ఉన్న ప్లేయర్ల కంటే బాబర్ ప్రత్యేకమైన ఆటగాడిగా అభివర్ణించారు.
ఎల్లప్పుడూ జోవియల్ గా ఉంటూ ఏది చెప్పినా నేర్చుకునేందుకు సిద్దంగా ఉంటాడని పేర్కొన్నాడు. క్రికెట్ ఆటకు సంబంధించి ప్రతిదీ తెలుసు కునేందుకు నిరంతరం ఆసక్తిని చూపుతాడని కితాబు ఇచ్చాడు.
ఈ తరం ఆటగాళ్లలో దూకుడు ఎక్కువగా ఉన్నప్పటికీ బాబర్ ఆజం(Babar Azam) మాత్రం అత్యంత బాధ్యాయుతమైన ఆటను ఆడేందుకు ఇష్ట పడతాడని తెలిపాడు విరాట్ కోహ్లీ .
ఇదిలా ఉండగా సూపర్ -4 లో భాగంగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. మ్యాచ్ అనంతరం తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఆయా దేశాలకు చెందిన అభిమానులు అనుకున్నంతగా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవన్నారు. ఏ ఆటగాడు ఎంపికైనా లేదా ఆడినా తన దేశం కోసం ఆడతారని ఇది వాస్తవమన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్ అన్నది ముఖ్యమని, ఒకప్పుడు డబ్బులు అంతగా వచ్చేవి కావని కానీ ఇప్పుడు సీన్ మారిందన్నాడు కోహ్లీ. ఆయన అనేక అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఆటగా క్రికెట్ మారి పోయిందన్నాడు. ఇదిలా ఉండగా పాకిస్తాన్, భారత దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆడడం నిలిచి పోయింది. ఈ తరుణంలో ఇరు దేశాల జట్ల ఆటగాళ్లు మాత్రం తమ మధ్య ఎలాంటి వైరం లేదంటూ ప్రకటించారు.
Also Read : ఇక ఆడలేనంటూ సురేష్ రైనా గుడ్ బై