Manjinder Singh Sirsa : అర్ష్ దీప్ పై ట్వీట్..జుబైర్ పై ఫిర్యాదు
సిక్కు సమాజంపై ద్వేషం వ్యాప్తి చేశాడు
Manjinder Singh Sirsa : యూఏఈ వేదికగా ఆసియా కప్ -2022 లో భాగంగా సూపర్ -4 కింద జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓటమి పాలైంది భారత జట్టు.
కీలకమైన సమయంలో సులభంగా వచ్చిన బంతిని జార విడిచాడు పంజాబ్ లోని మొహాలీకి చెందిన అర్ష్ దీప్ పై విపరీతమైన ట్రోల్ జరిగింది.
ఇదే సమయంలో అర్ష్ దీప్ సింగ్ పై వరుస ట్వీట్లతో హోరెత్తించాడు ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహమ్మద్ జుబైర్. ఇదే విషయాన్ని గుర్తించి సిక్కు సమాజాన్ని కించ పరిచేలా చేశాడంటూ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సిర్సా(Manjinder Singh Sirsa) ఫిర్యాదు చేశారు.
మహ్మద్ జుబైర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మంజీందర్ సింగ్ డిమాండ్ చేశారు. తన ట్వీట్ తో కావాలని అర్ష్ దీప్ సింగ్ కావాలని ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ట్వీట్లు చేశారు.
ఈ మేరకు జుబైర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని లేక పోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు బీజేపీ నాయకుడు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో దాఖలు చేసిన తన ఫిర్యాదులో ట్వీట్లను సిర్సా ఉదహరించారు.
ఇందుకు సంబంధించి ట్వీట్ల స్క్రీన్ షాట్ లను పంచుకున్నారు. ఈ ట్వీట్లలో ఎక్కువ భావం పాకిస్తానీ ఖాతాల నుంచి వచ్చినవేనని, జుబైర్ దేశ వ్యతిరేక అంశాల సూచన మేరకు ప్రవర్తించాడని ఆరోపించారు.
తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కుట్రను వెలికి తీసేందుకు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ఇండియాలో ఉన్నా ఖలిస్తానీ మద్దతుదారులకు సపోర్ట్ చేస్తున్నారంటూ సిర్సా ఆరోపించారు.
Also Read : అర్ష్ దీప్ సింగ్ దేశానికి గర్వకారణం