Nitish Kumar Comment : ట్రబుల్ షూటర్ ప్రధాని అవుతారా
దేశ రాజకీయాలలో నితీశ్ చక్రం తిప్పుతారా
Nitish Kumar Comment : దేశ రాజకీయాలలో తలపండిన నాయకుడిగా గుర్తింపు పొందారు నితీశ్ కుమార్(Nitish Kumar) . జేడీయూ చీఫ్ గా, బీహార్ సీఎంగా ప్రస్తుతం ఆయన కొలువు తీరారు. కానీ అంతకు ముందు ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు.
అపారమైన రాజకీయ అనుభవం ఆయన స్వంతం. 1951లో పుట్టిన ఆయన తనదైన శైలిలో తలపండిన నాయకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.
2015 నుండి బీహార్ కు సీఎంగా పని చేస్తూ వచ్చారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. తొలిసారిగా జనతాదళ్ సభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు.
1985లో ఎమ్మెల్యే అయ్యారు. ప్యూర్ సోషలిస్ట్ అని తనకు తానే చెప్పుకుంటారు. 1994లో జార్జ్ ఫెర్నాండెజ్ తో కలిసి సమతా పార్టీని స్థాపించారు.
1996లో లోక్ సభకు ఎన్నికయ్యాడు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు. ఆయన పార్టీ ఎన్డీఏలో చేరింది.
2003లో తన పార్టీని జనతా దళ్ యునైటెడ్ లో విలీనమైంది. 2005లో బీహార్ లో మెజారిటీ సాధించారు. బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2010లో అఖండ మెజారిటీ లభించింది.
2013లో మోదీ పీఎం అభ్యర్థిగా పేర్కొన్న తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి మహా ఘట్ బంధన్ ఏర్పాటు చేశాడు. 2014లో సీఎం పదవికి రాజీనామా చేశారు.
అతడి స్థానంలో జితన్ రామ్ మాంఝీ సీఎం అయ్యారు. 2015లో తిరిగి రావడానికి యత్నించాడు. మాంఝీ రాజీనామా చేయడంతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు.
2017లో అవినీతి ఆరోపణలపై ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్నాడు. తిరిగి బీజేపీతో జత కట్టాడు. 2020లో తక్కువ మెజారిటీతో తిరిగి ఎన్నికైంది. ఆగస్టు 2022లో 17 ఏళ్ల బంధానికి బీజేపీతో కటీఫ్ చెప్పాడు.
ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలు, నాయకులతో మంతనాలు, భేటీలు జరుపుతున్నారు.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సరే మహా కూటమి పవర్ లోకి రావాలనే నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
ప్రస్తుతం దేశంలో తనకంటూ ఎదురు లేకుండా చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా నితీశ్ కుమార్ కు ఉందని విపక్షాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం బీజేపీ వర్సెస్ బీజేపీయేతర పార్టీలు, వ్యక్తుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మరి ఈ యుద్దంలో నితీశ్ కుమార్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : ప్రధానమంత్రి పదవి రేసులో లేను