Queen Elizabeth II : రాజ‌సౌధంలో ఉన్నా రాణిగా రాణింపు

దేశానికి జీవితం అంకితం ఎలిజబెత్

Queen Elizabeth II : కొంద‌రు నేత‌లు ఎల్ల‌కాలం గుర్తంచుకునేలా పాల‌నా ప‌రంగా దేశంపై ముద్ర క‌న‌బ‌రుస్తారు. అలాంటి వారిలోకి వ‌స్తారు యుకె ప్రిన్స్ ఎలిజబెత్ -2. సుదీర్ఘ కాలం పాటు దేశానికి రాణిగా ఉన్నారు.

ఆమె వ‌య‌స్సు 96 ఏళ్లు. క్వీన్ ఎలిజ‌బెత్(Queen Elizabeth II) గా త‌న ప‌రిమితుల‌ను గుర్తించింది. రాణిగా త‌న జీవితాన్ని అంకితం చేసింది. క‌ల్లోల భ‌రిత శ‌తాబ్దంలో స్థిర‌త్వం వైపు త‌న దేశాన్ని న‌డిపించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించింది.

గ్రేట్ బ్రిట‌న్ గొప్ప నాయ‌కురాలిని కోల్పోయింది. యావ‌త్ ప్ర‌జానీకం ఆమెను స్మ‌రించుకుంటోంది. ఆమె మ‌ర‌ణం యుకెకే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి తీర‌ని లోటుగా భావించ‌క త‌ప్ప‌దు.

రాజ‌సౌధంలో ఉన్నా రాణిగా పేరొందారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కృషి చేశారు. తన ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పాల‌నా ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. కామ‌న్వెల్త్ ప్ర‌జ‌ల‌కు కూడా ఒక శ‌కానికి ముగింపు ప‌లికిన‌ట్ల‌యింది.

వాస్త‌వానికి క్వీన్ ఎలిజ‌బెత్ నిల‌బ‌డిన ప్ర‌మాణాలు , స‌మ‌ర్థించిన విలువ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని స్మ‌రించు కోవ‌డం విశేషం. ఎక్కువ కాలం కొలువు తీర‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు.

భార‌త దేశంతో ఆమెకు ప్ర‌త్యేక‌మైన బంధం ఉంది. మూడుసార్లు ఈ దేశాన్ని ప‌ర్య‌టించారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌, ఆత్మీయ‌త‌, ఆతిథ్యం త‌న‌ను ఎంత‌గానో ముగ్దురాలిని చేశాయంటూ ప్రిన్స్ ఎలిజ‌బెత్ కొనియాడారు.

ఆమె సుదీర్ఘ పాల‌నా కాలంలో ఎక్కువ‌గా కుటుంబానికి సంబంధించి ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంది. ప్ర‌ధానంగా ప్రిన్స్ డ‌యానా దుర్మ‌ర‌ణంపై పెక్కు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆమె వీట‌న్నింటినీ భ‌రించింది. రాజ‌సౌధం ఎప్ప‌టికీ ర‌హ‌స్యాల‌ను క‌ప్పి పుచ్చ‌దంటూ లోకానికి చాటి చెప్పింది. 1940లో ఆమె పెళ్లి చేసుకుంది.

ఆనాటి నుంచి నేటి దాకా దేశం బాగుండాల‌ని త‌పించింది. మిగ‌తా దేశాల‌తో స‌త్ సంబంధాలు నెరిపేలా చూసింది. క్వీన్ ఎలిజబెత్ కు ప్ర‌కృతి అన్నా, జంతువులంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ప్ర‌త్యేకంగా గుర్రాలు, కుక్క‌లంటే చ‌చ్చేంత ఇష్టం.

ఇదే స‌మ‌యంలో త‌న కుటుంబంలో నెల‌కొన్న పిల్ల‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రించారు. ఉత్త‌ర ఐర్లాండ్ , స్కాట్లాండ్ తో స‌హా గ్రేట్ బ్రిట‌న్ ఐక్య‌తలో ప్రిన్స్ ఎలిజబెత్ పాత్ర విస్మ‌రించ లేనిది.

ఏ రోజు కీర్తి ప్ర‌తిష్ట‌ల కోసం పాకులాడ‌లేదు. రాణిగా ఉన్నా రాజ్య‌కాంక్ష వైపు చూడ‌లేదు. హృద‌యం క‌లిగిన అసాధార‌ణ మ‌హిళగా కీర్తి గ‌డించారు.

Also Read : భార‌త్ తో ఎలిజబెత్ తో బంధం

Leave A Reply

Your Email Id will not be published!