Mumbai Dabbawalas : రాణికి ముంబై డబ్బావాలాల సంతాపం
సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు
Mumbai Dabbawalas : 96 ఏళ్ల వయస్సులో సుదీర్ఘ కాలం పాటు బ్రిటన్ కు రాణిగా ఉన్న ప్రిన్స్ ఎలిజబెత్ కన్ను మూశారు. ఆమె మరణంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచం గుర్తు చేసుకుంటోంది.
తమతో గడిపిన అరుదైన సన్నివేశాలను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ముంబైకి చెందిన డబ్బావాలాలు కూడా.
తమతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2019లో డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ నుండి అందుకున్న లేఖను ప్రస్తావించారు ముంబై డబ్బావాలాల అసోసియేషన్ చైర్మన్ సుభాష్ తలేకర్.
అందమైన ఆభరణాలు , ప్రిన్స్ ఆర్చీ పుట్టిన రోజు సందర్భంగా హ్యారీఈ, మేగాన్ లకు పంపిన లేఖకు ధన్యవాదాలు తెలిపారు. క్వీన్ మరణతో ప్రపంచం శోక సంద్రంలో మునిగి పోయిన వేళ ముంబై డబ్బావాలా(Mumbai Dabbawalas) అసోసియేషన్ రాజ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.
చాలా కాలం పాటు పని చేసిన బ్రిటిష్ రాణి మరణంపై తమ విచారం వ్యక్తం చేసింది. జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. ప్రిన్స్ భారత దేశాన్ని సందర్శించినప్పటి నుండి ముంబై డబ్బావాలా అసోసియేషన్ ఆ రాజ కుటుంబంతో సన్నిహిత సంబంధం కలిగి ఉందన్నారు.
తామంతా ఆమె మరణంతో విచారం కలిగి ఉన్నామని పేర్కొన్నారు. ముంబై లోని డబ్బా వాలాలంతా క్వీన్ ఎలిజబెత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
తాము అందించిన సేవలను గుర్తు పెట్టుకుని ప్రత్యేకంగా లేఖ రాయడం ఇప్పటికీ మరిచి పోలేక పోతున్నామని డబ్బావాలాలు అంటున్నారు.
Also Read : భారత్ తో ఎలిజబెత్ తో బంధం