Achyuta Samanta Comment : మనకూ ‘అచ్యుత సమంత’ కావాలి
పేదరికాన్ని జయించిన విజేత
Achyuta Samanta Comment : ఎవరీ అచ్యుత సమంత(Achyuta Samanta), ఎందుకు ఇవాళ ఆయనను గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విద్యా సంస్థ యావత్ ప్రపంచం వైపు దృష్టిని ఆకర్షించింది.
కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)ని స్థాపించారు. విద్య ప్రాధాన్యతను గుర్తించారు. కేవలం 125 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 70,000 వేల మంది గిరిజన, ఆదివాసీ విద్యార్థులు చదువు కుంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పనిని ఒకే ఒక్కడు చేసి చూపించాడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎందుకని ఫలితాలు రావడం లేదనేది ఆలోచించాల్సిన అంశం.
ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న కళింగ సంస్థ అనుసరిస్తున్న విధానాలు, పద్దతుల్ని ఐక్య రాజ్య సమితి గుర్తించింది. కేఐఐటీతో పాటు కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోసల్ సైన్సెస్ (కిస్) వ్యవస్థాపకుడిగా (KISS) పేరొందాడు.
వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన డాక్టర్ అచ్యుత సమంత 20 జనవరి 1965న ఒడిశాలోని కటక్ లోని కలరాబంకలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగారు.
కళింగ సంస్థలో వృత్తి పరమైన శిక్షణతో 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ , వసతి, ఆహారం, విద్యను అందజేస్తున్నారు.
అచ్యుత సమంత తన వితంతువు తల్లి, ఏడుగురు తోబుట్టువులతో పేదరికం మధ్య పెరిగాడు. ఆయన తండ్రి పేరు శ్రీ అనాది చరణ్ సమంత, తల్లి నీలిమ రాణి సమంత.
ఇక అచ్యుత సమంతకు నాలుగు సంవత్సరాల వయస్సులో అతడి తండ్రి రైలు ప్రమాదంలో మరణించాడు. ఆనాటి నుంచి తన తల్లి కన్నీళ్లను
తుడిచాడు. సమంత చెల్లెలు రచయిత్రి, ఎడిటర్, సినిమా నిర్మాత, పాత్రికేయురాలుగా గుర్తింపు పొందారు.
ఇదే సమయంలో అచ్యుత సమంత కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. స్థానిక కాలేజీలో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంతో పాటు ప్రైవేట్ ట్యూషన్స్ కూడా చెప్పాడు.
1992-93లో కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఏర్పాటు చేశాడు. ఇంటర్నేషనల్ బాకలారియాట్ అనుబంధ పాఠశాల, కేఐఐటీ అనే రెండు విద్యా సంస్థలను స్థాపించారు.
కేవలం రూ. 5,000 అద్దె భవనంలో కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అంతే కాదు అచ్యుత సమంత
కాదంబిని మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (కేఎంపీఎల్) ద్వారా సంస్కృతి, కళల సంస్థ ను ఏర్పాటు చేశారు.
ప్రచార కర్త, గిరిజన సంస్కృతి , జీవితం , కళలను ప్రదర్శించేందుకు గాంధీ జ్ఞాపకార్థం గాంధీ గ్రామ్ గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ గ్రామ్ యోగా, ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఏర్పాటు చేశారు.
25 కంటే ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాలు , పుణ్య క్షేత్రాలను స్థాపించింది. లెక్కలేనన్ని అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు అచ్యుత సమంత.
కేఐఐటీ యూనివర్శిటీ మాజీ ఛాన్స్ లర్ , కార్యదర్శి కూడా ఉన్నారు. సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో సమంత కొత్త రికార్డులు సృష్టించారు. భారత దేశంలోని ఏ విశ్వ విద్యాలయానికైనా అతి పిన్న వయస్కుడైన ఛాన్స్ లర్ గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కనిపించారు అచ్యుత సమంత.
ప్రపంచంలోని టాప్ 15 సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డు పొందారు. ఆకలి, పేదరికం లేకుండా, నిరక్షరాస్యత కోసం నిరంతరం పని చేస్తున్నారు
అచ్యుత సమంత(Achyuta Samanta). ఆయన ఇప్పటి వరకు దేశంలోని వివిధ జిల్లాల్లో 11కి పైగా కళింగ సంస్థలను విస్తరించారు.
10,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని అందించడమే కాకుండా 100 మందికి పైగా విజయవంతమైన పారిశ్రామిక వేత్తలను , 1,00,000 మందికి పైగా పరోక్ష ఉపాధి కల్పించారు.
పేదరికాన్ని జయించి విజేతగా నిలిచిన అచ్యుత సమంతను చూసి నేర్చు కోవాల్సి ఉంది. ఇలాంటి అచ్యుతలు మనకూ కావాల్సిన అవసరం ఉంది కదూ.
Also Read : ‘కళింగ’కు యునెస్కో పురస్కారం