PAK vs SL Asia Cup 2022 : శ్రీలంక భళా పాకిస్తాన్ విలవిల
5 వికెట్ల తేడాతో అద్భుత విజయం
PAK vs SL Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీ ఆసియా కప్ -2022లో సూపర్ -4కు చేరుకున్న శ్రీలంక దుమ్ము రేపుతోంది. ఇప్పటికే టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్న భారత్, పాకిస్తాన్ జట్లను మట్టి కరిపించింది.
ఆఫ్గనిస్తాన్ చేతిలో లీగ్ మ్యాచ్ లో ఓటమి పాలైన శ్రీలంక(PAK vs SL Asia Cup 2022) ఆ తర్వాత పుంజుకుంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటుతోంది. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది.
బలమైన పాకిస్తాన్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో లంకేయులు సక్సెస్ అయ్యారు. లక్ష్యం చిన్నదే అయినా గెలిచేందుకు తంటాలు పడింది శ్రీలంక.
పాతుమ్ నిస్సాంక అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా భానుక రాజపక్సే నిలిచాడు. నిస్సాంక 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తన జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. మరో వైపు రాజపక్సే సైతం కీలకమైన 24 పరుగులు చేసి ప్రధాన భూమిక పోషించాడు. దీంతో ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే శ్రీలంక జయకేతనం ఎగుర వేసింది.
క్రమం తప్పకుండా వికెట్లు కూలుతున్నా ఎక్కడా తొట్రుపాటు కనిపించ లేదు నిస్సాంక. 121 పరుగులకు పాకిస్తాన్ ను ఆలౌట్ చేసింది శ్రీలంక.
వనిందు హసరంగా మూడు వికెట్లు తీస్తే ప్రమోద్ మదుషన్ , మహేష్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక పాకిస్తాన్ జట్టులో కెప్టెన్ బాబర్ ఆజమ్ 30 పరుగులు చేస్తే మహ్మద్ నవాజ్ 26 రన్స్ చేశాడు.
గత కొంత కాలంగా శ్రీలంక జట్టు ఆటతీరులో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
Also Read : జూలు విదిల్చిన రన్ మెషీన్